Gautham Ghattamaneni:టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కువగా వారసుల టాక్ వినిపిస్తోంది. ఏ స్టార్ హీరో వారసుడు ఎప్పుడు ఏ సినిమాతో తెరంగేట్రం చేస్తాడనే చర్చ అందరి అభిమానుల్లోనూ మొదలైంది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ హీరోగా అరంగేట్రం ఎప్పుడు ఉంటుందా? అని అంతా ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో మరో వారసుడి గురించి కూడా చర్చ మొదలైంది. అతనే ఘట్టమనేని గౌతమ్.
Gautham Ghattamaneni:టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కువగా వారసుల టాక్ వినిపిస్తోంది. ఏ స్టార్ హీరో వారసుడు ఎప్పుడు ఏ సినిమాతో తెరంగేట్రం చేస్తాడనే చర్చ అందరి అభిమానుల్లోనూ మొదలైంది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ హీరోగా అరంగేట్రం ఎప్పుడు ఉంటుందా? అని అంతా ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో మరో వారసుడి గురించి కూడా చర్చ మొదలైంది. అతనే ఘట్టమనేని గౌతమ్. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ హీరోగా అరంగేట్రం చేసే క్షణాల కోసం ఘట్టమనేని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Mahesh Babu Son Gautham Ghattamaneni Visits Mb Foundation 2
అయితే గౌతమ్ అడుగులు మాత్రం చాలా భిన్నంగా ఉంటున్నాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా కనిపించడం లేదు. కానీ సితార మాత్రం యమ యాక్టీవ్‌గా ఉంటూ అన్నకు పూర్తి భిన్నగా వ్యవహరిస్తోంది. అప్పుడే కమర్షియల్ బ్రాండ్లకు ప్రచార కర్తగా వ్యవహరిస్తూ అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తోంది. మహేష్ వారసుడు గౌతమ్ ..సితారలా ఎప్పుడు యాక్టీవ్ అవుతాడని ప్రిన్స్ మహేష్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న వేళ అందిరిని సర్ ప్రైజ్ చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.
గౌతమ్ పుట్టిన సమయంలో మహేష్ ఫ్యామిలీ చాలా కంగారుపడ్డారట. అతని ఆరోగ్యం గురించి ఆందోళనకు గురయ్యారట. ఆ క్షణం నుంచే చిన్నారులకు ఏదో విధంగా అండగా ఉండాలని నిర్ణయించుకున్న మహేష్, నమ్రత ఇందు కోసం ఎంబీ ఫౌండేషన్‌ని ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మహేష్ ఫౌండేషన్ ద్వారా 1000 మందికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి తమ గొప్ప మనసుని చాటుకున్నారు.
Mahesh Babu Son Gautham Ghattamaneni Visits Mb Foundation 3
ఆంధ్ర హాస్పిటల్స్, రెయిన్ బో హాస్పిటల్స్‌తో కలిసి ఎంబీ ఫౌండేషన్ ద్వారా మహేష్ దంపతులు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కొంత కాలంగా ఈ వ్యవహారాల్ని నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే ఈ సారి లిటిల్ ప్రిన్స్ గౌతమ్ పర్యవేక్షిస్తున్నారట. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న నమ్రత తన తనయుడి గురించి ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేశారు. గౌతమ్ ఎంబీ ఫౌండేషన్ వ్యవహారాలని పర్యవేక్షించడం, ఆపరేషన్లు జరిగిన చిన్నారులని ప్రత్యేకంగా కలిసి గౌతమ్ పరామర్శించడంతో నమ్రత పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు.
గౌతమ్‌ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. `రెయిన్ బో హాస్పిటల్స్‌కు గౌతమ్ తరచుగా వెళుతుంటాడు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా గౌతమ్ వచ్చాడు. ఎంబీ ఫౌండేషన్, రెయిన్ బో హాస్పిటల్స్ సంయుక్తంగా చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో గౌతమ్ కూడా ఓ భాగమే. అంకాలజీ, కార్డియో వార్డుల్లో ఉన్న పిల్లలని కలిసి గౌతమ్ ముచ్చటించాడు. వారి మొహంలో నవ్వుని తీసుకొచ్చాడు. నయం అవుతుందంటూ వారికి భరోసా ఇచ్చాడు` అంటూ నమ్రత షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.