HariHara Veeramallu: పవన్ కు ఆ పదం కలిసొస్తుందా..?
Latest News About Harihara Veeramallu: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తారలకు కొన్ని పదాలు కలిసివస్తాయి.
గోపీచంద్ కు చివర్లో సున్నా ఉంటే కలిసి వచ్చింది. త్రివిక్రమ్ ఆ అనే పదం కలిసి వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ కొత్త సంవత్సరం నుంచి వీర అనే పేరు కలిసివస్తోంది. వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఈ ఏడాది మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో వీర అనే ఆపడం మంచి హిట్ అందిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఇక వీర అనే పదంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు మొదటినుంచి భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఇక ఈ టైటిల్ లో కూడా వీర అనే పదం ఉండడంతో ఈ సినిమా కూడా హిట్ ను అందుకుంటుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా మార్చి 30న విడుదల కానుందని వినిపిస్తోంది. ఇప్పటి నుంచి అప్పటి దాకా టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఎవరి సినిమా విడుదల కావడం లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మార్చి 30న వస్తే నిస్సందేహంగా వీరవిహారం చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక మరోపక్క క్రిష్ చాలా గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో అతడికి కూడా ఈ సినిమా మంచి హిట్ ను అందిస్తుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వీర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.