బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా నుంచి తిరిగొచ్చాక తెలంగాణలో రాజకీయ పరిస్థితులతో పాటు పలు కీలక అంశాలపై మాట్లాడారు.
Ktr comments : తెలంగాణ (Telangana) రాష్ట్రం (State)లో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ (BRS) పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President) కేటీఆర్ (Ktr) ధీమా వ్యక్తం చేశారు. 90 నుంచి 100 స్థానాల్లో బీఆర్ఎస్ ఈజీగా గెలుస్తుందని, మరోసారి కేసీఆర్ (Kcr) ముఖ్యమంత్రి (Chief Minister) అవుతారు అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియాతో చిట్ చాట్ లో కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్కు ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసే దిశగా ఆలోచిస్తున్నామన్నారు.. ఆంధ్రప్రదేశ్లోనూ మా పార్టీ కార్యక్రమాలు ప్రారంభించింది అందుకేనన్నారాయన.
ప్రతిపక్షాలకు సవాల్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము ఉందా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒక పార్టీ కాకుండా ఎన్జీవో, దుకాణాన్ని నడుపుకోవాలి. గుజరాత్లో ఎన్నికలు జరుగుతుంటే రాహుల్ పారిపోయాడు. పీవీ నరసింహారావును అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అని కేటీఆర్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం గద్దె దిగాల్సిన అవసరం ఉంది. బీజేపీకి దమ్ముంటే దేశానికి చేసిన మంచి పనులు ఏంటో చెప్పాలి. నోట్ల రద్దుతో ఏం సాధించారో మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు రూ. 2 వేల నోట్ల రద్దుతో సాధించింది ఏంటో కూడా చెప్పాలి అని డిమాండ్ చేశారు.
తెలంగాణలో బీజేపీ లేనేలేదు
అసలు తెలంగాణలో బీజేపీ లేనే లేదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు. అదంతా సోషల్ మీడియాలోనే బీజేపీ హంగామా అని ఆయన పేర్కొన్నారు.
ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది ఎంఐఎం ఇష్టం..
మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను పక్క రాష్ట్రాల్లో పొగిడిన ఓవైసీ ఇక్కడ ఎందుకు విమర్శలు చేస్తున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది ఎంఐఎం పార్టీ ఇష్టం. ప్రజలు మత ప్రతిపాదికన ఓట్లు వేస్తారని నేను నమ్మను. మంచి ప్రభుత్వాన్ని మతాలకతీతంగా ఎన్నుకుంటారని నమ్ముతున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
షర్మిల, కేఏ పాల్ది భ్రమ మాత్రమే..
రాష్ట్రంలో మాతో పోటీ పడే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ భమల్లో ఉంది. రాష్ట్రంలో షర్మిల, కేఏ పాల్ అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. వారిది కూడా భ్రమనే అని కేటీఆర్ పేర్కొన్నారు.
టిక్కెట్లు.. ఇప్పుడే చెప్పలేం…
మంచి పనితీరు కనబర్చినవారికే ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపర్చుకోవాలని సీఎం అంటున్నారని గుర్తు చేశారు. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని కేటీఆర్అన్నారు. టికెట్ల విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమని తెలిపారు.