Vizag: న్యూ టెక్నాలజీ లీడర్‌గా భారత్
Vizag:ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, భారతీయ ఐటీ దిగ్గజాలు రెడీ అవుతున్నాయి. ఐటీ రంగంలో ఈ దశాబ్దమంతా భారత్‌దేనని కేంద్ర ఐటీ కార్యదర్శి అల్కేశ్ కుమార్ శర్మ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీ ఇండస్ట్రీ భారీ ఎత్తున నిర్మాణాలు, నియామకాలు చేపట్టడానికి సన్నద్ధమవుతోందన్నారు. ఇన్ఫినిటీ వైజాగ్-2023’ పేరుతో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న రెండు రోజుల ఐటీ సదస్సును ఆయన శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
విశాఖలో నిర్వహించిన ఇన్ఫినిటీ 2023 సదస్సు ఏపీలో ఉత్పాదక సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించింది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఆకర్షణలో ఏపీ ముందడుగు వేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1.4 లక్షల ఉద్యోగాలు సిద్దమవుతున్నాయన్నారు. న్యూ టెక్నాలజీ లీడర్‌గా భారత్ ఎదుగుతోందని, దాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత నవతరంపైనే ఉందని అన్నారు. రాబోయే ఐదేళ్లలో జీడీపీలో 20 శాతం ఐటీ రంగం నుంచే ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో స్టార్టప్‌లను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అందుకు విశాఖలో నిర్వహిస్తున్న ఇన్ఫినిటీ ఐటీ సమ్మిట్ వేదికగా నిలిచింది.