IT raids: హైదరాబాద్‌లో వరుసగా మూడు రోజులుగా ఐటీ సోదాలు (IT raids) కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలైన కేఎం కోహినూర్ (km kohinoor group), ఆర్ ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఇన్కమ్ ట్యాక్స్ (income tax) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
IT raids: హైదరాబాద్‌లో వరుసగా మూడు రోజులుగా ఐటీ సోదాలు (IT raids) కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలైన కేఎం కోహినూర్ (km kohinoor group), ఆర్ ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఇన్కమ్ ట్యాక్స్ (income tax) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేఎం కోహినూర్ గ్రూప్ సంస్థ అధినేత అహ్మద్ ఖాద్రీ ఇంటితో పాటు మొత్తం 40 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, కర్నాటక, నొయిడాలోనూ మూడు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
ఓ రాజకీయ నాయకుడికి కేఎం కోహినూర్ సంస్థ బినామీగా వ్యవహరిస్తోందని ఆదాయపు పన్ను శాఖ అధికారుల అనుమానిస్తున్నారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ లోని కోహినూర్ క్లాసిక్ టవర్లోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలో రెండు ఐటి శాఖ టీమ్‌లు సోదాలు చేస్తున్నాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ నగదు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పెద్ద ఎత్తున భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన పేపర్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేఎం కోహినూర్ పేరుతో బినామీ కంపెనీలు సృష్టించినట్లుగా గుర్తించారు. బినామీ కంపెనీల పేరు మీద రిజిస్టర్ వ్యాపారం చేసినట్లుగా సాక్షాలను అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.