పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ కు పలు కేసుల నుంచి తాత్కాలికంగా ఊరట కలుగుతోంది. ఆయన పై ఉన్న 150 అవినీతి కేసుల్లో ఎనిమిది కేసులకు మధ్యంతర బెయిల్ దొరికింది.
పాకిస్తాన్ (Pakistan) మాజీ ప్రధాని (PM) ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ఊరట (Relief) లభించింది. తనపై నమోదైన తీవ్రవాద ఆరోపణలకు చెందిన ఎనిమిది కేసుల్లో బెయిల్ (Bail)లభించింది. ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు మంగళవారం ఇమ్రాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుతో ఇమ్రాన్‌కు పాక్ మిలటరీ, ప్రభుత్వం నుంచి కాస్త ఉపశమనం దక్కినట్టే.
జూన్ 8 వరకూ…
పాకిస్థాన్ ప్రధానిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఇమ్రాన్ ఖాన్‌పై దాదాపు 150 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల్లో ఒకటైన
అల్ ఖదీర్ ట్రస్ట్ వివాదాన్ని విచారిస్తున్న నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ముందు ఇమ్రాన్ హాజరు కావాల్సి ఉంది. ఈ విచారణ సందర్భంగా మళ్లీ తనని అరెస్టు చేసే అవకాశం 80 శాతం ఉందని ఇమ్రాన్ హెచ్చరించారు. ఒకవేళ తనను కస్టడీలోకి తీసుకున్నా శాంతియుతంగా ఉండాలని ఆయన తన మద్దతుదారులకు సూచించారు. ఇమ్రాన్ కు జూన్ 8 వరకు మధ్యంత బెయిల్ లభించిందని ఆయన న్యాయవాది తెలిపారు.