వచ్చే నెలలో లార్డ్స్ లో జరిగే ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ ప్రైజ్ మనీని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఇండియా-ఆసీస్ మధ్య టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ జూన్ 7 నుంచి జరుగుతుంది.
ICC Prize Money: ఇండియా (India), ఆస్ట్రేలియా (Australia) మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (World Test Champinship) ఫైనల్ (Final) జరగనున్నది. ఆ ఫైనల్లో గెలిచిన విజేతకు 13 కోట్ల ప్రైజ్‌మనీ (Prize Money) ఇవ్వనున్నారు. రన్నర్ (Runner)జట్టుకు ఆరు కోట్లు అందజేయనున్నారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-23కు చెందిన ప్రైజ్‌మనీ(Prize Money)ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. దీనిపై ఇవాళ ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. 31.4 కోట్లను 9 జట్లు పంచుకోనున్నాయి. అయితే 2019-21లో జరిగే టెస్ట్ చాంపియన్‌షిప్(WTC)కు కూడా ఇంతే ప్రైజ్‌మనీ ఇచ్చారు. ఇక ఈసారి ఆస్ట్రేలియా, ఇండియా మధ్య లండన్‌లో ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 7వ తేదీన ప్రారంభం అయ్యే ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు 13.22 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనున్నది. ఇక రన్నరప్స్‌కు 6.61 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. తొలి నిర్వహించిన టెస్ట్ చాంపియన్‌షిప్‌కు, ఈసారి నిర్వహిస్తున్న టోర్నీ ప్రైజ్‌మనీలో ఎటువంటి మార్పు లేదని ఐసీసీ తన ప్రకటనలో చెప్పింది. 2021లో సౌంతాప్టన్లో జరిగిన ఫైనల్లో ఇండియాపై నెగ్గిన కివీస్ జట్టుకు 13 కోట్ల ప్రైజ్‌మనీ ఇచ్చారు. కేన్ విలియమ్సన్ ఆ రివార్డును అందుకున్నాడు. 2023 డబ్ల్యూటీసీ టెస్ట్ జట్లలో థర్డ్ ప్లేస్ లో ఉన్న సౌతాఫ్రికాకు 3.72 కోట్లు దక్కనున్నాయి. నాలుగవ స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌కు 2.9 కోట్ల ప్రైజ్‌మనీ అందుతుంది. అయిదో స్థానంలో ఉన్న శ్రీలంకకు 1.65 కోట్లు ముట్టనున్నాయి. ఈసారి న్యూజిలాండ్(6), పాకిస్థాన్(7), వెస్టిండీస్(8), బంగ్లాదేశ్(9) జట్లకు ఒక్కొక్కరికి 82 లక్షలు ఇవ్వనున్నారు.
Prize pot for the ICC World Test Championship 2021-23 cycle revealed 💰
Details 👇https://t.co/ZWN8jrF6LP
— ICC (@ICC) May 26, 2023