తాను ప్రధాని రేసులో లేనని శరద్ పవార్ ప్రకటించారు. దేశాభివృద్ధికి పాటుపడే నాయకత్వాన్ని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని అన్నారు.
Sharad Pawar : విపక్షాలన్నీ ఐక్యతారాగం పాడుతుంటే.. శరద్ పవార్ (Shard Pawar) చేసిన ఓ ప్రకటన ఆసక్తికరంగా మారింది. బీజేపీ (BJP)కి వ్యతిరేకంగా నితీష్ కుమార్ (Nitish Kumar) అందరినీ కలిపే ప్రయత్నాలు జరుపుతున్న వేళ ప్రధాన మంత్రి (Prime Minister) ఎవరన్న ప్రశ్న ఎదురైంది. ఈ విషయంపై స్పందించిన శరద్ పవార్ తాను ప్రధాని రేసులో లేనని ప్రకటించారు. దేశాభివృద్ధికి పాటుపడే నాయకత్వాన్ని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని అన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిస్తే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించడం పెద్ద విషయం కాదని అన్నారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చందుకు తాను కూడా ప్రయత్నాలు చేస్తున్నానని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనని, నేను ప్రధాన మంత్రి రేసులో లేనని అన్నారు. మహా వికాస్ అఘాడిలో భాగమైన కాంగ్రెస్ – శివసేన (UTB)తో సీట్ల పంపకంపై పవార్ మాట్లాడారు.
ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ లేదంటే మల్లికార్జున ఖర్గే కలిసి సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల పదవీ కాలం 2022తో ముగిసింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎన్నికలు జరగలేదు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు, ఆ తరువాత మహారాష్ట్ర ఎన్నికలు వరసగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి.