Danush: ధనుష్ తో మరో సినిమా చేస్తాం హాలీవుడ్ దర్శకులు
Dhanush is going to start career in Hollywood :విలక్షణ నటుడు ధనుష్…భాషతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తమిళంతో పాటు హిందీలోనూ పాపులారిటీ సంపాదించిన ఈ హీరో… ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. ఇక తాజాగా ధనుష్ హాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేశాడు. అక్కడ అతడు నటించిన తొలి చిత్రం ‘ది గ్రే మ్యాన్’. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈరోజు విడుదల కానుంది.
ఈ సినిమాలో ధనుష్ కాంట్రాక్ట్ కిల్లర్ పాత్రలో నటించాడు. ఈ సినిమాను తెరకెక్కించిన హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్.. ధనుష్‌కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ధనుష్ తో ప్రత్యేక సీక్వెల్ లేదా స్పిన్ ఆఫ్ చిత్రాన్ని రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు.
‘ది గ్రే మ్యాన్’ సినిమా ప్రమోషన్ల కోసం ముంబయికి వచ్చారు. ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడిన రూసో బ్రదర్స్.. ధనుష్‌పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ధనుష్‌తో మరో సినిమా చేసే ఆలోచన ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు.మాకు చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ధనుష్‌ను ఎక్కువ సేపు చూడాలనుకుంటున్నామని చాల మంది అడుగుతున్నారు. భవిష్యత్తులో ది గ్రే మ్యాన్‌లో ధనుష్ పోషించిన లోన్ వుల్ఫ్ పాత్రకు సీక్వెల్ లేదా స్పిన్ ఆఫ్ ఫిల్మ్స్ చేసే అవకాశముంది అని రూసో బ్రదర్స్ బదులిచ్చారు.
ఇక ఈ వార్తతో ధనుష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా ప్రీమియర్ షోకు ధనుష్ పంచెకట్టుతో హాజరయ్యాడు.