Weather: ఈసారి ఎండలు మండిపోనున్నాయి
Weather: గత కొన్నాళ్లుగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అకాల వర్షాలు ముంచెత్తాయి. ఆతరవాత చలి పంజా విసురుతూనే ఉంది. శివరాత్రి తరువాత ఎండలు మండిపోవాలి కానీ శివరాత్రికి ముందు ఎండలు మొదలవుతున్నాయి. ఇప్పటేకి ఎండాకాలం ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఆరంభ దశలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది విపరీతమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరి 11 నుంచి హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ఎల్నినో ప్రభావంతో వేసవి తుఫానులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే దాని గురించి ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని అధికారులు అంటున్నారు. రాత్రుళ్లు, ఉదయం మాత్రం చలి ఉండగా పాగాలు మాత్రం ఎండవేడిమి ఎక్కువవుతున్నాయి. అయితే నగరంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పిబ్రవరిలోనే ఈ ఎండలు ఇలాఉంటే ఇక మే వరకు ఎలాఉండనున్నాయో అని నగరవాసులు జంకుతున్నారు.