చర్మ సౌందర్యాన్ని పెంచి అలవాట్లే కాదు, తగ్గించే అలవాట్లు కూడా కొన్ని ఉన్నాయి.
Healthy Skin: చర్మం (Skin) ఆరోగ్యంగా (Healthy) ఉంటేనే అందంగా (Beauty) కనిపిస్తుంది. కాబట్టి చర్మ సంరక్షణ చాలా ముఖ్యమైనది. కానీ కొంతమంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. దీనివల్ల చర్మ సౌందర్యం (Beauty Skin) తగ్గుతుంది. చర్మం పాడవుతుంది. అలాంటి అలవాట్లను దూరం పెడితే చర్మ సౌందర్యాన్ని కాపాడుకున్న వారు అవుతారు.
1. మండే ఎండల్లో చాలామంది పౌడర్ రాసుకొని బయటకు వెళ్లి పోతారు. సన్ స్క్రీన్ లోషన్ ధరించేవారు చాలా తక్కువ. సన్ స్క్రీన్ లోషన్ కచ్చితంగా చర్మానికి రాయాలి. ఇది సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. అకాల వృద్ధాప్యం, వడదెబ్బ, చర్మకాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. కాబట్టి SPF 30 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ కొని వేసవిలో రాసుకోవడం చాలా మంచిది.
2. మేకప్ వేసుకున్నాక దాన్ని పూర్తిగా తొలగించుకున్నాకే నిద్రకు ఉపక్రమించాలి. కానీ చాలామంది మేకప్ వేసుకొని సాధారణ నీటితో శుభ్రపరచుకొని నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. చర్మం నిస్తేజంగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేకప్ రిమూవర్‌తో మేకప్‌ను తొలగించుకున్నాకే నిద్రపోవాలి.
3. కొందరు ముఖాన్ని తరచూ శుభ్రపరుస్తూనే ఉంటారు. ఫేస్ వాష్ లేదా సబ్బుతో అతిగా ముఖాన్ని కడుగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సహజ నూనెలు తొలగిపోతాయి. ఇవి చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. దీనివల్ల ముఖంపై గీతలు, ముడతలు త్వరగా పడతాయి. రోజుకు రెండుసార్లు కన్నా ఎక్కువ శుభ్రపరచుకోకపోవడమే మంచిది.
4. చర్మం ఎంత తేమవంతంగా ఉంటే అంత మంచిది. కాబట్టి మాయిశ్చరైజర్ ను తప్పకుండా రాసుకోవాలి. చర్మం పొడిబారిపోయి పొలుసులుగా మారుతుంది. ముఖంపై నూనె ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కాబట్టి మంచి మాయిశ్చరైజర్‌ను ఎంచుకొని ప్రతిరోజు అప్లై చేయడం ముఖ్యం.
5. మొటిమలు వచ్చినప్పుడు ఎంతో మంది వాటిని గిల్లుతూ ఉంటారు. దీనివల్ల అక్కడ మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే బ్యాక్టీరియా ఇతర చర్మానికి వ్యాప్తి చెందవచ్చు. కాబట్టి మొటిమలను గిల్లడం వంటివి చేయకూడదు.
6. చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి ఎక్స్ ఫోలియేట్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది అతిగా ఎక్స్ ఫోలియేట్ చేయడం వల్ల చర్మం దెబ్బ తింటుంది. కఠినమైన స్క్రబ్ ను పదేపదే చర్మంపై రుద్దకూడదు. వారానికి మూడు నాలుగు సార్లు స్క్రబ్ చేస్తే చాలు.
7. ముఖాన్ని శుభ్రపరచుకునేందుకు కొంతమంది వేడి నీరు ఉపయోగిస్తారు. వేడి నీళ్లు సహజనూనెను తొలగిస్తుంది. చర్మాన్ని పొడిగా అయ్యేలా చేస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని ఎంచుకుంటే మంచిది.