GYANVAPI MASJID CASE: యూపీలోని జ్ఞానవాపి మసీదు (GYANVAPI MASJID), శృంగార్ గౌరీ కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు (Varanasi court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన ఎనిమిది కేసులను కలిపి విచారిస్తామని వెల్లడించింది.
GYANVAPI MASJID CASE: యూపీలోని జ్ఞానవాపి మసీదు (GYANVAPI MASJID), శృంగార్ గౌరీ కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు (Varanasi court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన ఎనిమిది కేసులను కలిపి విచారిస్తామని వెల్లడించింది. ఇంతకముందు జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఏడు కేసులు నమోదు కాగా.. ఇటీవల శివలింగానికి సంబంధించి మరో కేసు నమోదు అయింది. దీంతో మొత్తం ఎనిమిది కేసులను ఒకేసారి.. ఒకే కోర్టులో విచారిస్తామని విరణాసి జిల్లా కోర్టు వెల్లడించింది. సోమవారం విచారణ అనంతరం తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు.. మంగళవారం వెలువరించింది.
ఇకపోతే పోయిన ఏడాది నుంచి జ్ఞానవాపి మసీదు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే గతేడాది వారణాసిలోని కోర్టు మసీదు వీడియో సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు సర్వే చేస్తుండగా మసీదులోని కొలనులో శివలింగం వంటి నిర్మాణం కనిపించింది. అలాగే గోడలపై కూడా హిందూ దేవుళ్ల వలే విగ్రహాలు కనిపించాయి. దీంతో కొలనులో ఉంది శిలింగమే అని హిందువులు భావిస్తున్నారు. తమకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. అయితే అటు ముస్లింలు మాత్రం అది శివలింగం కాదని.. ఫౌంటేన్ అని వాదిస్తున్నారు.