నాన్ వెజ్ కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్టు పడితేనే అదిరే రుచి వచ్చేది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Ginger garlic Paste: అల్లం వెల్లుల్లి (Ginger garlic)… ఈ రెండు కలిపి పేస్ట్ చేసుకుని దాచుకుంటారు. తెలుగిళ్లల్లో ఏ కూరకైనా (Curry) ఈ రెండింటి మిశ్రమం జత అయితే ఆ రుచి అదిరిపోతుంది. అంతేకాదు ఆయుర్వేద (Ayurvedam)మందుల్లో అల్లం వెల్లుల్లి (Ginger garlic Paste) రెండింటినీ వాడతారు. ఎన్నో ఔషధాల్లో (Medicine) ఈ రెండింటి స్థానం ప్రముఖమైనది. ఈ రెండింటి మిశ్రమం తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. వంటింటి ఔషధాల్లో ఈ రెండు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని పేస్ట్ గా చేసి వంటల్లో వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు.
రోజు అల్లం వెల్లుల్లి పేస్టుని కూరల్లో వేసుకొని తినడం వల్ల ఫ్లూ వంటివి త్వరగా రావు. రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు వంటివి త్వరగా దాడి చేయవు. శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా చాలా తగ్గుతుంది. ఆయుర్వేదం ప్రకారం చెప్పాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్టు వాడడం వల్ల వాత, పిత్త, కఫ దోషాలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఉదయం అల్పాహారంలో అల్లం వెల్లుల్లిని పేస్ట్ తో వండిన వంటలు పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే ఔషధ గుణాలు కీళ్లవాతాన్ని, మోకాళ్ళ వాతాన్ని తగ్గిస్తాయి.
కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కలిపి తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. కండరాలు బలంగా తయారవుతాయి. ఈ రెండూ కలిపి తినడం వల్ల మానసికంగానూ ఎంతో లాభం చేకూరుతుంది. మానసిక ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. డిప్రెషన్ బారిన పడే అవకాశం తగ్గుతుంది. గుండెకు ఇది ఎంతో మేలు చేస్తుంది. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. డయాబెటిస్ బారిన పడినవారు ఈ పేస్టును ఖచ్చితంగా కూరల్లో వాడుకోవాలి. ఇలా వాడడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణసంబంధత రోగాలు కూడా ఇవి రాకుండా అడ్డుకుంటాయి.
పక్షవాతానికి గురి అయిన వారు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు తో వండిన వంటలు తినడం వల్ల ఆ రోగం త్వరగా తగ్గే అవకాశం ఉంది. నిత్యం అల్లం వెల్లుల్లి పేస్టు తినేవారికి పక్షవాతం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి నాన్ వెజ్ కూరల్లోనే కాదు వెజ్ కూరల్లో కూడా ఈ మిశ్రమాన్ని వాడేందుకు ప్రయత్నించండి.