Forbes List: బిల్ గేట్స్ ను వెనక్కి నెట్టిన అదానీ
Gautam Adani Overtakes Bill Gates: భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ ఇప్పుడు ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు. ఈ దెబ్బతో ఆయన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెనక్కు నెట్టారు. ఫోర్బ్స్ బిలియనీర్ల రియల్ టైమ్ ర్యాంకింగ్ ప్రకారం, బిల్ గేట్స్ నికర విలువ $102 బిలియన్లు కాగా గౌతమ్ అదానీ & ఫ్యామిలీ $114 బిలియన్ల కంటే ఎక్కువ నికర విలువ కలిగి ఉంది. గత వారం బిల్ గేట్స్ తన ఆస్తుల నుండి $ 20 బిలియన్లను గేట్స్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం తర్వాత, బిల్ గేట్స్ ర్యాంకింగ్ పడిపోయింది, దీంతో ఆయన ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో నాల్గవ స్థానం నుండి ఐదవ స్థానానికి చేరుకున్నాడు. గౌతమ్ అదానీ గేట్స్ విరాళం వల్ల ప్రయోజనం పొంది నాల్గవ స్థానానికి చేరుకున్నాడు.
విశేషమేమిటంటే, 2021 ప్రారంభంతో పోలిస్తే భారతీయ వ్యాపారవేత్త ఆదానీ సంపద రెండింతలు పెరిగింది. ఇప్పుడు ఈ సంపద 112.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. గౌతమ్ అదానీ వ్యాపారం బేసిక్ ఇన్ఫ్రా, ఎలక్ట్రిసిటీ, గ్రీన్ ఎనర్జీ, గ్యాస్, పోర్టులకు విస్తరించింది. గౌతమ్ అదానీ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు. ఇక పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై $70 బిలియన్ల వరకు పెట్టుబడి పెట్టబోతున్నారు. చాలా కాలంగా భారత్‌తో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ ఈ రేసులో నిరంతరం వెనుకబడి పోతున్నారు. ఫోర్బ్స్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, అంబానీ-అదానీల మధ్య ఈ అంతరం $26 బిలియన్లకు పైగా పెరిగింది. అంబానీ నికర విలువ 87 బిలియన్ డాలర్లు మాత్రమే.