దక్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్ లైన్స్ కు చెందిన విమాన డోర్ ను ఓ ప్రయాణికుడు తెరిచాడు. దీంతో ప్రయాణికులు వణికిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్అ వుతున్నాయి
Flight Danger : మరో మూడు నిమిషాల్లో విమానం (Aeroplane) ల్యాండ్ అవుతుందనంగా.. ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ (emergency door) తెరచి ప్రయాణికులందరినీ భయపెట్టాడు. ఏషియానా ఎయిర్లైన్స్ విమానం (Asiana Airlines flight ) దక్షిణ కొరియా (South Korea) లోని జెజు ద్వీపం (Jeju Island ) నుంచి డేగూ (Daegu )కు బయలు దేరింది. విమానం భూమికి 700 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. మరో మూడు నిమిషాల్లో డేగూ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉండగా… ఊహించని ఘటన చోటు చేసుకుంది. విమానం ఎమర్జెన్సీ డోర్ వద్ద కూర్చున్న 30 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా ఆ డోర్ ఓపెన్ చేశాడు. దాన్ని రెండు నిమిషాల పాటూ తెరిచే ఉంచాడు. ఆ సమయంలో విమానంలో 194 మంది ప్రయాణికులు సహా సిబ్బందితో కలిసి మొత్తం 200 మంది ఉన్నారు.
భయంతో వణికిపోయిన ప్రయాణికులు
ఉన్నట్టుండి డోర్ తెరుచుకోవటంతో విమానంలో ఉన్న 200 మంది భయంతో వణికిపోయారు. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక కేకలుపెట్టారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. తొమ్మిది మంది ప్రయాణికుల్ని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. అయితే, విమానం డేగూ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది
Asiana Airlines plane's door opens right before landing at Daegu Airport#DaeguAirport #SouthKorea #BREAKING pic.twitter.com/am4X9mQk6V
— Pranjal Mishra 🇮🇳 (@Pranjal_Writes) May 26, 2023
Asiana Airlines plane's door opens right before landing at Daegu Airport#DaeguAirport #SouthKorea #BREAKING pic.twitter.com/am4X9mQk6V
— Pranjal Mishra 🇮🇳 (@Pranjal_Writes) May 26, 2023
Man arrested after opening door as plane prepared to land in South Korea, 9 people taken to hospital pic.twitter.com/auWDv1Z6au
— Pranjal Mishra 🇮🇳 (@Pranjal_Writes) May 26, 2023