Pushpa 2: ‘పుష్ప 2’ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ..?
Esha Gupta In Allu Arjun’s Pushpa-2: అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ కు టాలీవుడ్ సత్తా చూపించింది. పుష్ప గా బన్నీ, భన్వర్ సింగ్ షెకావత్ గా మలయాళ సూపర్ స్టార్ ఫహాద్ ఫాజిల్ నటన అద్భుతమని చెప్పాలి.
ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ చిత్రంలో స్టార్ లు నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా వారిలోకి బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా కూడా జాయిన్ అయ్యింది. అయితే పుష్ప 1 లో సామ్ చేసిన సాంగ్ ను ఈషా చేయాల్సి ఉంది. కానీ అనుకోని విధంగా ఆ ఛాన్స్ సామ్ కొట్టేసింది. దీంతో సుకుమార్ ఈసారి పుష్ప 2 లో ఈషా కు ఐటెం సాంగ్ కాకుండా ఒక కీలక పాత్రను ఇచ్చినట్లు సమాచారం.
మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. ఒక వేళ ఈ హాట్ బ్యూటీ కనుక ఈ సినిమాలో నటిస్తే సుకుమార్ ఎలాంటి పాత్రను క్రియేట్ చేసి ఉంటాడు అని అందరు ఆలోచిస్తున్నారు. మరి ఈ సినిమాలో ఈషా నటిస్తుందో లేదో తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.