రక్తహీనత సమస్య మహిళల్లో అధికంగా వస్తుంది
Dry Fruits: ఎనీమియా (Anemia).. దీన్నే రక్తహీనత అంటారు. ఇది సర్వసాధారణ సమస్య. కానీ దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు (Side Effects) మాత్రం ఇబ్బంది పడతాయి. ఈ సమస్య అధికంగా పిల్లల్లో (kids), మహిళల్లో (women) కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరు నెలల నుంచి ఆరు ఏళ్ల వయసు ఉన్న పిల్లల్లో రక్తహీనత (anemia) ఉంటుంది. అలాగే మహిళల్లో 57% మంది దీని బారిన పడుతున్నారు. ప్రతినెలా నెలసరి (Periods) సమయంలో రక్తం పోవడం, డెలివరీల సమయంలో రక్తం పోవడం వల్ల మహిళలు తరచూ రక్తహీనత బారిన పడుతూ ఉంటారు. వీరిలో ఎర్ర రక్త కణాలు తగినంతగా ఉత్పత్తి కావు. దానివల్లే ఈ సమస్య వస్తుంది. ఐరన్ లోపం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి ఐరన్ లోపం లేకుండా చూసుకుంటే రక్తహీనత సమస్య రాదు. కాబట్టి ఐరన్ అధికంగా ఉండే ఎండుద్రాక్షను రోజు తినాలి. రాత్రి పూట పది నుంచి పదిహేను ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని నీటితో సహా తినడం మంచిది. ఇది ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా రక్తహీనత సమస్య కూడా పోతుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఇంట్లో ఉండే కిస్మిస్లు కూడా ఎండు ద్రాక్ష జాతికే వస్తాయి.
ఎండుద్రాక్షను తినడం వల్ల రక్తహీనత తగ్గడమే కాదు, చర్మ సౌందర్యం కూడా ఇనుమడిస్తుంది. దీనిలో ఐరన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. దీనిలో పొటాషియం, కాల్షియం కూడా ఉంటాయి. కాబట్టి ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు పెళుసుగా మారుతాయి. అలా మారకుండా ఉండాలంటే ఎండుద్రాక్షలను రోజూ తినాలి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహకరిస్తుంది. అలాగే వెంట్రుకలను కూడా ఆరోగ్యంగా పొడవుగా పెరిగేలా చేస్తుంది.
గుండెకు రక్షణ కల్పించడంలో కూడా ఎండు ద్రాక్షలు ముందుంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా చూస్తాయి. దీనివల్ల శరీరమంతటికి రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది. గుండెపోటు, గుండె వైఫల్యం వంటి పరిస్థితులు రాకుండా ఎందుకు ద్రాక్షలు అడ్డుకుంటాయి. అధిక రక్తపోటు బారిన పడినవారు ఎండు ద్రాక్షలను తినడం అలవాటు చేసుకోవాలి. ఇది రక్తపోటును పెంచకుండా చూసుకుంటుంది. వీటిలో పీచు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం సమస్య రాదు.
ఎండు ద్రాక్షల్లో వృక్ష సమ్మేళనాలు ఉంటాయి. అవి దంతక్షయం రాకుండా కాపాడతాయి. మహిళలు నెలసరి సమయంలో నొప్పి, తిమ్మిరిని అధికంగా అనుభవిస్తారు. వీటిని తినడం అలవాటు చేసుకుంటే ఆ నొప్పి, తిమ్మిరి తగ్గుతాయి.