తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Micro Plastics: వేసవికాలంలో (Summer) తెగ దాహం వేస్తుంది. గ్లాసుల కొద్దీ నీరు (Water) గొంతులో దిగుతూనే ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు స్టీలు గ్లాసులోనే నీళ్లు తాగే అవకాశం ఉంది. కానీ బయటికి వెళితే మాత్రం వాటర్ బాటిల్ (Plastic water Bottle) కచ్చితంగా చేతిలో ఉండాల్సిందే. ఆ వాటర్ బాటిళ్లలో 90 శాతం మంది వాడుతున్నది ప్లాస్టిక్‌తో (Plastic) తయారు చేసినవే. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు కలుగుతుందని చెబుతున్నా వాటితో తయారు చేసిన వస్తువులను వాడే వారి సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికే హాని కలుగుతుందంటే… సున్నితమైన మన ఆరోగ్యానికి ప్రమాదం లేకుండా ఉంటుందా? అందుకే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తో నీళ్లు తాగడం చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు వైద్యులు.
వేసవిలో సూర్య కిరణాల నుంచి వచ్చే అమితమైన వేడిని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ గ్రహిస్తాయి. అవి కూడా వేడెక్కుతాయి. అలా వేడెక్కి మైక్రోప్లాస్టిక్ అంటే అతి సూక్ష్మ స్థాయిలో ప్లాస్టిక్ కణాలను నీటిలోకి విడుదల చేస్తాయి. ఆ నీటిని మనం తాగడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఎండోక్రైన్ వ్యవస్థ కూడా ఎంతో ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా కాలేయం దెబ్బతింటుంది. ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మగవారిలో అయితే ప్రొస్టేట్ క్యాన్సర్ రావచ్చు.
ఎండలో వేడెక్కిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నుంచి డయాక్సిన్ అనే విషపదార్థం నీటిలో విడుదలవుతుంది. ఇది నీటిలో కలిశాక… ఆ నీటిని తాగితే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మగవారిలో అయితే వీర్యకణాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని వల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. వాటి సంఖ్య తీవ్రంగా తగ్గే ఛాన్స్ ఉంది.
వాటర్ బాటిల్లోని నీటిలో కలిసిన మైక్రోప్లాస్టిక్ లను తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి సమస్యలు మహిళలకు రావచ్చు. మైక్రో ప్లాస్టిక్‌ల వల్ల సమీప భవిష్యత్తులో రకరకాల క్యాన్సర్లు వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి.