కొద్ది రోజులుగా డౌన్ ట్రెండ్ ఫాలో అవుతున్న బంగారం ధరలు (Gold Price).. ఈ రోజు కూడా అదే ఫాలో అయ్యాయి. మే నెల ప్రారంభంలో ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసిన పసిడి ధరలు.. కొద్ది రోజులుగా శాంతిస్తూ వస్తోన్నాయి.
Gold Price Today : కొద్ది రోజులుగా డౌన్ ట్రెండ్ ఫాలో అవుతున్న బంగారం ధరలు (Gold Price).. ఈ రోజు కూడా అదే ఫాలో అయ్యాయి. మే నెల ప్రారంభంలో ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసిన పసిడి ధరలు.. కొద్ది రోజులుగా శాంతిస్తూ వస్తోన్నాయి. ఇక వెండి ధరలు కూడా బంగారాన్ని పాలో అవుతూ సామాన్యులకు శుభవార్తనే వినిపిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూ ఉండటంతో.. దేశీయంగా పసిడి రేటు తగ్గుతూ వస్తోంది. గ్లోబల్ మార్కెట్లో చూస్తే.. మేలో 2030 డాలర్లకు చేరిన పసిడి రేటు తర్వాత పడిపోయి.. ఇప్పటికీ ఆ ధరను అందుకోలేకపోతోంది. అదే ఇప్పుడు పుత్తడి ప్రేమికులకు (Gold lovers) సానుకూల అంశంగా మారిందని నిపుణులు అంటున్నారు.
మే నెలలోనే రూ. వెయ్యి తగ్గిన పుత్తడి ధరలు..
ఇక హైదరాబాద్ మార్కెట్లో పుత్తడి ధరలను (Gold prices in Hyderabad) గమనిస్తే.. మే 5న పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200 గా వద్ద ఉంది.
అదే ఇప్పటి పసిడి ధరలను చూస్తే.. 24 క్యారెట్ల పుత్తడి ధర (Price of 24 carat gold) రూ. 61,410 గా వద్ద ఉంది. ఇక 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం రేటు (22 carat ornament gold price)రూ. 56,290 గా ఉంది. అంటే ఒక్క మే నెల ప్రారంభంలోని రేట్లతో పోలిస్తే.. ప్రస్తుతం గోల్డ్ రేట్లు కాస్త భారీగానే తగ్గాయనే చెప్పుకోవాలి.
అలాగే మే 5 నుంచి చూస్తే.. 24 క్యారెట్ల బంగారం ధరలు ఇప్పటి వరకు దాదాపు రూ. 1000 వరకూ పడిపోయాయి. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు అయితే రూ. 900 దిగి వచ్చింది. ఒకవిధంగా ఇది బంగారం కొనే వారికి గుడ్ న్యూస్ గానే చెప్పాలి.
బంగారాన్ని ఫాలో అవుతున్న వెండి..
అటు సిల్వర్ రేటు కూడా గోల్డ్ ధరలనే పాలో అవుతుండటంతో.. వెండి రేటు (Silver Price) కూడా భారీగా పడిపోయింది. వెండి ధర మే 5న కేజీకి రూ. 83,700 గా ఉంది. అదే ఇప్పుడు.. రూ. 78,600గా ఉంది. అంటే సిల్వర్ రేటు ఏకంగా రూ. 5 వేలు పతనం అయింది.
ఇటు మంగళవారం హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి ఉపయోగించే 10 గ్రాముల పసిడి ధర రూ.290 తగ్గి రూ.56,290 నుంచి రూ.56,000 కు చేరుకుంది. స్వచ్ఛమైన గోల్డ్ ధర రూ.61,000 మార్క్‌ను టచ్ చేసింది. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర చూస్తే 10 గ్రాముల ధర రూ.310 తగ్గి రూ.61,410 నుంచి రూ.61,100 ధరకు చేరుకుంది.
మరోవైపు ఇప్పుడున్న బంగారం, వెండి ధరలు ఇలాగే ఎన్ని రోజులు కొనసాగుతాయో చెప్పలేమని నిపుణులు అంటున్నారు. కొద్ది నెలల్లోనే బంగారం 68 వేలకు, వెండి 90 వేలకు చేరుకునే అవకాశాలూ లేకపోలేదని చెబుతున్నారు.