Surendar Reddy Injured: సెట్లో ప్రమాదం.. సురేందర్ రెడ్డికి గాయం.. అయినా తగ్గకుండా?
Director Surendar Reddy Injured in Agent Shoot: ఈ రోజు ఉదయం బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి షూటింగ్ షూటింగ్ లో గాయపడగా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఏజెంట్ మూవీ షూటింగ్‌లో గాయపడ్డాడు. అక్కినేని అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా తెరకెక్కిస్తున్న సురేందర్ రెడ్డి.. షూటింగ్‌లో కాలికి రాడ్ తగలడంతో ఆసుపత్రిలో చేరాడు. అయితే గాయానికి చికిత్స చేయించుకొని మళ్లీ సెట్‌కు వచ్చి ఆయన షూటింగ్ కొనసాగించాడు. ఒక రకంగా ఆయన గాయంతో బాధపడుతూనే.. ఏజెంట్ మూవీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఈ విషయాన్ని బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా బయట పెట్టారు. అలీ సురేందర్ రెడ్డి గాయానికి సంబంధించిన ఫొటో ట్వీట్ చేయగా.. వైరల్ అవుతోంది. ‘ఈ ఉదయం సెట్ లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డా, చాలా ధైర్యవంతుడు. ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చి షూట్ చేస్తూనే ఉన్నాడు..’ అని అలీ రెజా రాసుకొచ్చారు. వైద్యులు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా.. తాను లేకపోతే మొత్తం షూటింగ్ ఆగిపోతుందని సురేందర్ రెడ్డి మాత్రం నొప్పిని భరిస్తూ షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టాడని తెలుస్తోంది. కాలుకు కట్టు కట్టుకుని వీల్ చక్రాల బండి నుంచే యాక్షన్, కట్ అంటూ కీలక సన్నివేశాలను షూట్ చేయించారట.