Mahesh babu:సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కారణంగా నేషనల్ అవార్డ్ మిస్సయ్యాడా? అంటే టాలీవుడ్ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన `పుష్ప` మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Mahesh babu:సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కారణంగా నేషనల్ అవార్డ్ మిస్సయ్యాడా? అంటే టాలీవుడ్ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన `పుష్ప` మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది.
వరల్డ్ వైడ్‌గా రూ.350 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. అంతే కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్ల జాబితాలో చేర్చింది. దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్‌ని పాపులర్ అయ్యేలా చేసింది. ఇవన్నీ ఒకెత్తయితే గురువారం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో అల్లు అర్జున్ `పుష్ప` సినిమాకుగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని దక్కించుకుని మొట్టమొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించేలా చేసింది. 70 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఏ హీరో సాధించని ఫీట్‌ని అల్లు అర్జున్ సాధించి ఆ ఘనతని దక్కించుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డు సృష్టించారు.
అయితే ఈ సినిమా బన్నీ చేయాల్సింది కాదన్నది చాలా తక్కువ మందికి తెలుసు. ముందు ఈ కథని దర్శఖుడు సుకుమార్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు వినిపించారు. రష్ లుక్, మాస్ క్యారెక్టర్, లుంగీ ధరించి కలోడిగా కనిపించడం.. వంటి విషయాలు మహేష్‌కు పెద్దగా నచ్చలేదు. అలా తాను చేస్తే ప్రేక్షకులు చూడరని, కథలో,క్యారెక్టర్లో మార్పులు చేయమన్నారు. అది నచ్చని సుకుమార్ ఆ కథని అల్లు అర్జున్‌కు వినిపించారు.
మహేష్ నచ్చలేదని చెప్పిన క్యారెక్టర్‌నే మరింత కసిగా మలిచారు. వెండితెరపై బన్నీని పుష్పరాజ్ పాత్రలో కొత్తగా ఆవిష్కరించారు. దీంతో `పుష్ప` సినిమా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది. ఊహించని క్రేజ్‌తో పాటు పాన్ ఇండియా విజయాన్ని బన్నీకి అందించింది. అంతే కాకుండా ఊహించని విధంగా నేషనల్ అవార్డుని తెచ్చి పెట్టింది. దీంతో మహేష్ కు దక్కాల్సిననేషనల్ అవార్డ్ బన్నీకి దక్కిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ మిస్సయిన నేపథ్యంలో 2019లో మహేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా సుకుమార్‌తో నా సినిమా జరగడం లేదు` అని అప్పట్లో మహేష్ ట్వీట్ చేశారు. అదే ఇప్పుడు ట్రెండ్ అవుతుండటంతో ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.