జైపూర్ (jaipur)లో చాలా ప్యాలెస్ లు, కోటలు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ ప్యాలెస్(Palace) లు ఇప్పుడు జైపూర్ లో (jaipur hotels)ప్రముఖ హోటళ్లుగా మారాయి. వాటిలో రామ్ బాగ్ ప్యాలెస్( Rambagh Palace) ఒకటి.
జైపూర్ (jaipur)లో చాలా ప్యాలెస్ లు, కోటలు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ ప్యాలెస్(Palace) లు ఇప్పుడు జైపూర్ లో (jaipur hotels)ప్రముఖ హోటళ్లుగా మారాయి. వాటిలో రామ్ బాగ్ ప్యాలెస్( Rambagh Palace) ఒకటి. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో ఉన్న రామ్ బాగ్ ప్యాలెస్ జైపూర్ మహారాజ యొక్క పూర్వపు నివాసం. ఇప్పుడు ఇది హోటల్ గా మార్పు చెందింది. భవానీ సింగ్ రోడ్ పై జైపూర్ నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ హోటల్ ఉంది. జైపూర్ లోని అత్యంత అందమైన ప్యాలెస్ లలో ఇది ఒకటి. ఈ హోటల్ లో బస చేసేందుకు దేశ, విదేశీ టూరిస్టులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు.
అత్యుత్తమ హోటల్‌గా రాంబాగ్ ప్యాలెస్
ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్‌గా రాంబాగ్ ప్యాలెస్ (Rambagh Palace) ఎంపికై భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తోంది.రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్((jaipur) నగరానికి జ్యువల్గా పిలుచుకునే జైపూర్ మహారాజు పూర్వ నివాసం. ఒక లగ్జరీ హోటల్‌గా మారింది. రాంబాగ్ ప్యాలెస్ (Rambagh Palace) అని పిలిచే ఈ హోటల్ అద్భుతమైన గార్డెన్స్, అందమైన ఇండియన్ ఆర్కిటెక్చర్ ప్రదర్శిస్తూ హృదయాలను దోచేసుకుంటుంది.తాజాగా ఈ హోటల్ ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్‌గా ఈ రాంబాగ్ ప్యాలెస్ (Rambagh Palace) ఎంపికై భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తోంది.
ఆన్లైన్ ట్రావెల్ వెబ్సైట్ ట్రిప్ అడ్వైజర్ ఏటా “ట్రావెలర్స్ ఛాయిస్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టాప్ హోటల్స్” అవార్డులను అందిస్తుంది. కాగా 2023 టాప్ హోటల్స్ లిస్ట్‌లో ఇండియన్ హోటల్ రాంబాగ్ ప్యాలెస్ ఫస్ట్(Rambagh Palace first place) ప్లేస్ కొట్టేసింది. 2022, జనవరి 1 నుంచి 2022, డిసెంబర్ 31 వరకు 15 లక్షలకు పైగా హోటళ్ల నుంచి 12 నెలల ట్రిప్ అడ్వైజర్ (TripAdvisor) రివ్యూ డేటాను విశ్లేషించి, రాంబాగ్ ప్యాలెస్ నంబర్.1 హోటల్‌గా తేల్చారు.ట్రిప్ అడ్వైజర్ సైట్లో రాంబాగ్ ప్యాలెస్‌కి దాదాపు 5,751 మంది 5-స్టార్ రేటింగ్ అందించారు. సందర్శకులు ప్యాలెస్ అందమైన పరిసరాలు, రుచికరమైన ఆహారం, ఫ్రెండ్లీ స్టఫ్కు ఫిదా అయినట్లు తెలిపారు. విశ్రాంతి తీసుకోవడానికి, రాయల్ అనుభవాన్ని ఆస్వాదించడానికి ఇది గొప్ప ప్రదేశం అని చెప్పారు.
ప్యాలెస్ చరిత్ర ఏమిటి అంటే..?
జ్యువెల్ ఆఫ్ జైపూర్‌గా పిలిచే మొదటి రాంబాగ్ ప్యాలెస్‌ను 1835లో నిర్మించారు. మొదట్లో ఇది రాణికి ఇష్టమైన పనిమనిషికి నివాసంగా ఉండేది. కానీ తర్వాత అది రాయల్ గెస్ట్‌హౌజ్, హంటింగ్ లాడ్జ్‌గా రూపాంతరం చెందింది. 1925లో జైపూర్ మహారాజు రాంబాగ్ ప్యాలెస్‌ను తన శాశ్వత నివాసంగా చేసుకున్నారు. రాంబాగ్ ప్యాలెస్ ఒకప్పుడు చక్రవర్తులకు మాత్రమే ఆతిథ్యాన్ని ఇచ్చేది. నేడు సందర్శకులకు లగ్జరీ లైఫ్‌స్టైల్ అనుభవించే అవకాశాన్ని అందిస్తుంది.ఈ ప్యాలెస్ 47 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో అద్భుతమైన తోటలు, విశాలమైన వరండాలు, అందంగా నిర్మించిన గదులు ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మహారాజా సవాయి మాన్ సింగ్ ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. నేడు టాటా గ్రూప్‌కి చెందిన తాజ్ హోటల్స్, రిసార్ట్స్ & ప్యాలెసెస్ ఈ హోటల్ మేనేజ్మెంట్ మెయింటెనెన్స్‌ను చూసుకుంటుంది.
గొప్ప వ్యక్తులకు ఈ ప్యాలెస్ ఆతిధ్యం
రామ్ బాగ్ ప్యాలెస్ రాజ్ పుత్ మరియు మొఘలుల వాస్తుశిల్పాలను కళ్లకు కడుతుంది. ఈ ప్యాలెస్, అక్కడి అందమైన తోటలు దాదాపు 47 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్యాలెస్ తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ ప్యాలెస్ ల ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇందులో ఒక మినీ గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. భారత్ తో పాటు విదేశాలలోని అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులకు ఈ ప్యాలెస్ ఆతిధ్యం ఇచ్చింది. వారిలో క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ కూడా ఉన్నారు. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలలో ఒకరైన జైపూర్ రాణి గాయత్రి దేవి నివాసం.
విలాసవంతమైన గదులు
జైపూర్ లోని ఈ అద్భుతమైన ప్యాలెస్ ఒకప్పుడు మహారాజ మన్ సింగ్ II మరియు సౌందర్య వతి అయిన అతని భార్య గాయత్రీ దేవిల నివాసంగా ఉండేది. విలాసవంతమైన తాజ్ గ్రూప్ బ్రాండ్ నడుపుతున్న ఈ హోటల్ స్వచ్చమైన తోటలతో, ఆకర్షణీయమైన పచ్చికల దృశ్యాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఎన్నో ఉన్నత స్థాయి విలాసవంతమైన గదులు ఉన్నాయి. జైపూర్ వెళ్లే టూరిస్టులు ఈ ప్యాలెస్ ను తప్పకుండా సందర్శించాలి. ఇది ఎంతో గొప్ప అనుభవాన్ని మీకందిస్తుంది.రాజ్‌పుత్ ఆతిథ్యం యొక్క అత్యుత్తమ సంప్రదాయంలో, రాంబాగ్ ప్యాలెస్ దాని అతిథులకు లగ్జరీ మరియు దుబారాను అందిస్తుంది, ఇది ఒకప్పుడు రాజుల ఏకైక సంరక్షణ. ఇది సొగసైన గదులు, పాలరాతి కారిడార్లు, అవాస్తవిక వరండాలు మరియు 47 ఎకరాలలో నిర్మించిన గంభీరమైన తోటలు చరిత్రతో ప్రతిధ్వనిస్తాయి.
మిగతా టాప్ హోటల్స్ ఇవే..
మాల్దీవుల్లోని ఓజెన్ రిజర్వ్ బోలిఫుషి (Ozen Reserve Bolifushi) ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ హోటళ్లలో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. హాంకాంగ్‌లోని ది రిట్జ్-కార్ల్టన్ (The Ritz-Carlton), బ్రెజిల్‌లోని హోటల్ కొలిన్ డి ఫ్రాన్స్ (Hotel Colline de France), లండన్‌లోని షాంగ్రి-లా ది షార్డ్ (Shangri-La The Shard), దుబాయ్‌లోని JW మారియట్ మార్క్విస్ హోటల్ టాప్ 10 హోటల్స్‌లో చోటు సంపాదించాయి