Satyendar Jain: ఢిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ (Satyendar Jain) మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తిహార్ జైలులో (Tihar Jail) ఉన్నారు. అయితే బుధవారం రాత్రి సత్యేందర్ జైన్ జైలు బాత్రూమ్లో (Bathroom) కాలు జారి పడిపోయారు.
Satyendar Jain: ఢిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ (Satyendar Jain) మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తిహార్ జైలులో (Tihar Jail) ఉన్నారు. అయితే బుధవారం రాత్రి సత్యేందర్ జైన్ జైలు బాత్రూమ్లో (Bathroom) కాలు జారి పడిపోయారు. దీంతో ఆయనకి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే జైలు అధికారులు సత్యేందర్ జైన్‌ను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి (DDU Hospital) తరలించారు. ప్రస్తుతం సత్యేందర్ జైన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇకపోతే మనీ లాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్ గత ఏడాది మే 31న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి సత్యేందర్ జైన్ జైలులోనే ఉన్నారు. దాదాపు ఏడాదిగా జైలులో ఒంటరిగా ఉండడం వల్ల తాను ఆందోళనకు గురవుతున్నానని సత్యేందర్ జైన్ వెల్లడించిన విషయం తెలిసిందే. జైలుకి వెళ్లాక ఆయన 35 కిలోల బరువు తగ్గారని అటు ఆప్ వర్గాలు తెలిపాయి. అలాగే ఈనెల 22న కూడా సత్యేందర్ జైన్ అనారోగ్యానికి గురి కావడంతో జైలు అధికారులు ఆయన్ను ఢిల్లీలోని సఫ్లర్ జంగ్ దవాఖానకు తరలించారు. ఆయనకు వెన్ను ఎముక సమస్య రావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
మరోవైపు బెయిల్ కోసం సత్యేందర్ జైన్ పలుమార్లు పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆయనకు న్యాయస్థానాల్లో ఊరట లభించలేదు. సత్యేందర్ జైన్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు నిరాకరించాయి. ఈక్రమంలో జైన్ న్యాయవాది గతవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.