Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) హైదరాబాద్‌కు చేరుకున్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. మరికాసేపట్లో ప్రగతి భవన్ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో (Cm kcr) సమావేశం కానున్నారు.
ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై (BJP) పోరాటానికి అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డనెన్స్ను పార్లమెంట్లో (parliament) వ్యతిరేకించాలని విపక్షాలను కోరుతున్నారు కేజ్రీవాల్. ఇప్పటికే ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే, బీహార్ సీఎం నితీశ్ కుమార్, శరద్ పవార్‌లతో అరవింద్ కేజ్రీవాల్లతో సమావేశమై చర్చించారు. వాళ్లు అరవింద్ కేజ్రీవాల్‌కు పూర్తి మద్ధతు ప్రకటించారు.
ఈక్రమంలో కేసీఆర్ మద్ధతు కోరేందుకు హైదరాబాద్‌కు వచ్చారు అరవింద్ కేజ్రీవాల్. మరికాసేపట్లో ప్రగతి భవన్లో కేసీఆర్‌తో భేటీ అయి మద్ధతు కోరనున్నారు. అయితే కేంద్రంపై నిత్యం నిప్పులు చెరిగే కేసీఆర్.. తప్పకుండా కేజ్రీవాల్‌కు మద్ధతిచ్చే అవకాశం ఉంది.