రైలు ప్రయాణంలో ( Railway Stations )మనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఎదురవుతూ ఉంటాయి. కిటికీ దగ్గర కూర్చొని గంటల తరబడి పొలాలు, నదులు, అడవులు, పర్వతాలను చూస్తున్న అనుభూతి వేరు.
రైలు ప్రయాణంలో ( Railway Stations )మనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఎదురవుతూ ఉంటాయి. కిటికీ దగ్గర కూర్చొని గంటల తరబడి పొలాలు, నదులు, అడవులు, పర్వతాలను చూస్తున్న అనుభూతి వేరు. ఈ ప్రయాణం ద్వారా అనేక రకాల వ్యక్తులను కలుసుకునే అవకాశం లభిస్తుంది. పురాతన రైల్వే స్టేషన్లు పాత రైల్వే స్టేషన్లుగా పిలువబడే స్టేషన్లు ఎక్కడ వున్నాయంటే..? దేశంలో ఇటువంటి రైల్వే స్టేషన్లు చాలానే ఉన్నాయి. ఈ స్టేషన్లు చాలా మంది ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు, ఈ రైల్వేస్టేషన్లకు చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. పురాతన (old Railway Stations )రైల్వే స్టేషన్లుగా పేరొందిన ఇలాంటి రైల్వే స్టేషన్లు( Railway Stations ) మన దేశంలో చాలానే ఉన్నాయి. వీటి ప్రత్యేకతలు తెలుసుకునేందుకు చాలామంది యాత్రికులు ఈ ప్రాంతాలను సందర్శిస్తున్నారు కూడా.
బరోగ్ రైల్వే స్టేషన్
బరోగ్ (barog Railway Stations )రైల్వేస్టేషన్ భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్ జిల్లాలో ఉన్న ఒక చిన్న రైల్వేస్టేషన్. ఈ స్టేషన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కల్కా. సిమ్లా రైల్వేస్టేషన్లో ఉంది. స్టేషన్ సముద్రమట్టానికి సుమారు 1531 మీటర్ల ఎత్తులో . కల్కా నుండి సుమారు 42.14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫొటోగ్రఫీని ఇష్టపడే వారికి ఈ ప్రాంతం అనువైనది. ఇది కల్కా సిమా్ల రైల్వేలో పొడవైన సొరంగంగా బాగా ప్రసిద్ధి చెందింది.
హౌరా జంక్షన్, కోల్‌కతా
ఈ స్టేషన్ భారతదేశంలోని పురాతన రైల్వే స్టేషన్. ఇది 1852 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రోజుకు 10 లక్షల మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇది 23 ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంటుంది. భారతదేశంలో మొదటి రైలు ప్రయాణించిన స్టేషన్లలో ఇది ఒకటి. కోల్‌కతా నగరానికి సేవలు అందిస్తున్న నాలుగు ఇంటర్సిటి రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి. మిగిలినవి సీల్దా స్టేషన్, షాలిమార్ స్టేషన్ మరియు కోల్‌కతా రైల్వేస్టేషన్. టెర్మినల్ స్టేషన్ హౌరా బ్రిడ్జి ద్వారా కోల్‌కత్తాకు అనుసంధానించబడింది. హుగ్లీనదికి పశ్చిమ ఒడ్డున ఉంది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై
ఇది భారతదేశంలోని పురాతన రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది ముంబైలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్. గతంలో ఈ రైల్వే స్టేషన్‌ను విక్టోరియా టెర్మినస్ అని పిలిచేవారు. భారతదేశంలోని సెంట్రల్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం కూడా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. భారతదేశంలో తాజ్‌మహాల్ తర్వాత అత్యధికంగా చిత్రీకరించబడిన స్మారకచిహ్నం.
మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రు కలుసుకున్న రైల్వే స్టేషన్ ఎక్కడ వుంది..?
చార్బాగ్ రైల్వే స్టేషన్ నవాబుల నగరమైన లక్నోలో ఉంది. ఇది 1915 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ రైల్వే స్టేషన్ పేరు చార్బాగ్. దీని చుట్టూ నాలుగు అందమైన పార్కులు ఉన్నాయి. ఈ అందమైన స్టేషన్లో రాజస్థానీ మరియు మొఘల్ నిర్మాణాల మిశ్రమాన్ని కూడా దర్శనమిస్తాయి. ఇదే ఇక్కడి అత్యంత విశేషమేమిటంటే, ఈ స్టేషన్ పైనుంచి చూస్తే చదరంగంలాగా ఉంటుంది. ఒకే బోర్డుపై గోపురాలు, స్తంభాలు, మరియు టెర్రట్లు వంటి చదరంగం ముక్కలు ఉండడం దీని ప్రత్యేకత. ఈ స్టేషన్ కింద వివిధ సొరంగాలు ఉన్నాయి. వీటిని నేడు వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. స్టేషన్ వరండాలో నిలబడితే రైళ్లు కదులుతున్న శబ్దం వినబడదు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రు మొదటిసారిగా 1916లో ఈ రైల్వేస్టేషన్లో కలుసుకున్నారు.