Netflix: కోవిడ్ తర్వాత జనాలు థియేటర్లకు వెళ్లడం మానేసి ఓటీటీలకు (OTT) అతుక్కుపోయారు. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్నీ ఓటీటీలోకి వచ్చేస్తుండడంతో థియేటర్లకు (Theaters) వెళ్లడమే మర్చిపోయారు.
Netflix: కోవిడ్ తర్వాత జనాలు థియేటర్లకు వెళ్లడం మానేసి ఓటీటీలకు (OTT) అతుక్కుపోయారు. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్నీ ఓటీటీలోకి వచ్చేస్తుండడంతో థియేటర్లకు (Theaters) వెళ్లడమే మర్చిపోయారు. పైసా ఖర్చు లేకుండా తెలిసిన వాళ్లదో లేదా స్నేహితులదో ఓటీటీ ప్లాట్‌ఫామ్ పాస్వర్డ్ తీసుకొని ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నారు. అయితే అటువంటి వారికి షాక్ ఇచ్చింది దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (theaters). పాస్వర్డ్ షేరింగ్‌కు చెక్ పెట్టింది.
ఇకపై ఇతరులతో పాస్వర్డ్ షేర్ (Password Sharing) చేసుకుంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే పాస్వర్డ్ షేర్ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఐపీ అడ్రస్‌లు, డివైజ్ ఐడీలు, అకౌంట్ యాక్టివిటీ ఆధారంగా పాస్వర్డ్ కుటుంబ సభ్యులకు షేర్ చేస్తున్నారా.. లేక ఇతరులకు షేర్ చేస్తున్నారా అనేది నిర్ధారిస్తామని నెట్‌ఫ్లిక్స్ చెప్పింది. ఈ విధానాన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టగా మంచి ఫలితాలు వచ్చాయని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. అతి త్వరలో ఈ విధానం యూజర్లకు అందుబాటులోకి వస్తుందని వివరించింది.
కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అమెరికాలో ఈ ఫీజును నెలకు 7.99 డాలర్లుగా.. యూకేలో 4.99 డాలర్లుగా నిర్ణయించినట్లు పేర్కొంది. అయితే భారత్‌లో పాస్వర్డ్ షేరింగ్ ఫీజు ఎంత నిర్ణయించారనేది వెల్లడించలేదు.