Chiranjeevi: పవన్ మూడు పెళ్లిళ్లు.. చిరు షాకింగ్ కామెంట్స్
Chiranjeevi Shocking Comments On Pawan Kalyan Three Marriages: మెగాస్టార్ చిరంజీవి, శ్రుతి హాసన్ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ పెంచేసిన చిరు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చాడు..ఇక ముఖ్యంగా పవన్ పాలిటిక్స్ పై.. మూడు పెళ్లిళ్ల విషయమై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
” మూడు పెళ్లిళ్లు చేసుకోవడం అది కళ్యాణ్ ఇష్టం. దాని గురించి తాను ఎలాంటి కామెంట్ చేయదలుచుకొలేదు” అని అన్నాడు. పలు సందర్భాల్లో ఏపీ సీఎం జగన్ సైతం పవన్ మూడు పెళ్లిళ్లపై సెటైర్లు వేశారని ప్రశ్నించగా.. రాజకీయంలో విమర్శల గురించి తాను ఏం మాట్లాడదలచుకోలేదని తెలిపాడు. ఇక రామ్ గోపాల్ వర్మ మాటలపై కూడా తానేమీ పట్టించుకోనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.