CM Jagan on TDP Manifesto: తెలుగు దేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో కర్ణాటకలో కాంగ్రెస్..బీజేపీ ఇచ్చిన హామీలన్నీ కలిపి వండేసిన బిస్బిల్లా బాత్ గా ముఖ్యమంత్రి జగన్ అభివర్ణించారు. రాజమండ్రిలో మహానాడు పేరుతో ఒక డ్రామా నడించిందన్నారు. ఎన్నికలకు ముందు ఆకర్శణీయమైన మేనిఫెస్టో.. ఆ తరువాత ప్రజలను వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటని జగన్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో 2023–24 సీజన్‌కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి విడుదల చేసారు.
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి మళ్లీ వారే ఆ మనిషి యుగ పురుషుడు, శక పురుషుడు, రాముడు అని, కృష్ణుడు అని కీర్తిస్తూ అదే మనిషి పోటోకు దండేస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతీ ఎన్నిక కు ఒక వేషం వేస్తారని విమర్శించారు. విశ్వసనీయత లేదని ఆరోపించారు. వెన్నుపోటు పొడవటమే చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీగా వివరించారు. 2019 ఎన్నికల్లో తన పార్టీ మేనిఫెస్టో ఎలా సిద్దం చేసిందీ జగన్ వివరించారు. ప్రజల గుండె చప్పుడుగా తన మేనిఫెస్టో నిలుస్తుందన్నారు. పేద ప్రజల ఉజ్వల భవిషత్తు కోసం మట్టి నుంచి మేనిఫెస్టో పుట్టిందని వివరించారు. చంద్రబాబు మేనిఫెస్టో మాత్రం మన రాష్ట్రంలో పుట్టలేదని చెప్పారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలతో పాటుగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్నవి కాపీ కొట్టేసి పుతి హోరా వండేసారని చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకు ఒరిజనాల్టీ..పర్సనాలిటీ లేవదన్నారు. క్యారెక్టర్..క్రెడిబులిటీ లేకుండా రాజకీయం చేస్తన్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. టీడీపీకి 175 నియోజకవర్గాల్లో 175 మంది క్యాండెట్లు కూడా లేరన్నారు. మైదానాల్లో మీటింగ్‌లు పెడితే జనం రారని ఇరుకైన సందులు, గొందుల్లో మనుషులు చనిపోయినా ఫర్వాలేదని వెతుకున్నే పార్టీ అని వ్యాఖ్యానించారు. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీగా పేర్కొన్నారు. 1995 లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఇంకోఛాన్స్ఇవ్వండి చేసేస్తా అని అడుగుతున్నారని ఎద్దేవా చేసారు. మంచి చేసానని చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అయిన తరువాత చే సిన మొదటి సంతకానికి ఒక క్రెడిబులిటీ, విశ్వసనీయత ఉంటుంది. కానీ చంద్రబాబు మొదటి సంతకాలనే మోసంగా మార్చారన్నారు.
వచ్చే ఎన్నికలు కురుక్షేత్ర యుద్దంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఈ యుద్దం కాదు..‡పేదవాడు, పెత్తందార్ల మధ్య యుద్ధంగా వివరించారు. పేదవాడు మన వైపున ఉన్నాడు. ఈ రోజు వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య ఈ యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. చంద్రబాబు పేదలతో యుద్ధం చేస్తున్నారన్నది గుర్తు పెట్టుకోవాలిని సూచించారు. అబద్ధాలు నమ్మకండి, దుష్ప్రచారాన్ని నమ్మకండని పిలుపునిచ్చారు. మంచి జరిగిందని నమ్మితే తనకు తోడుగా నిలవాలని జగన్ కోరారు.