హాస్య బ్రహ్మనందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కోడుకు సిద్ధార్ధ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
హాస్య బ్రహ్మ (Comedian Brahmanandam)ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కోడుకు సిద్ధార్ధ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. డాక్టర్ ఐశ్యర్య తో ఎంగేజ్ మెంట్ ఘనంగా నిర్వహించారు. అ వేడుకకు కమెడీయన్, ఆలీ,సుబ్బారామిరెడ్డి సహా పలువురు సెలబ్రిటీలు విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని ..ప్రస్తుతం వీరి ఎంగేజ్ మెంట్ సోఎషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు వున్న సంగతి తెలిసిందే.
పెద్ద కొడుకు రాజా గౌతమ్(gowtham) పల్లకిలో పెళ్లికూతురు(pallikilo pellikuthuru) సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆతర్వాత కొన్ని సినిమాల్లో నటించారు గౌతమ్. బ్రహ్మానందం(Brahmanandam) చిన్న కొడుకు సిద్దార్ధ్(Brahmanandam 2nd Son, Siddharth)విదేశాల్లో అక్కడే చదువుకోని ఉద్యోగం చేస్తున్నారట. బ్రహ్మానందం వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు. 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. తెలుగులొ 20వ శతాబ్దంలొ వచ్చిన సినిమాలన్నింటిలో నటించారు.
నరేశ్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించారు. తన పుట్టినరోజు ఫిబ్రవరి 1 వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేయడం విశేషం. నటుడిగా గుర్తింపు నిచ్చిన అహ నా పెళ్లంట చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించిపెట్టింది. మనీ, అనగనగా ఒక రోజు, అన్న, వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారాలను పొందాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో అత్యధిక సినిమాలు నటించి నందుకు చోటు దక్కించుకున్న ఏకైక హాస్య నటుడు.