బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి అత్యుత్తమ అవార్డు దక్కింది. ఎంతో మంది రోగులకు చికిత్స అందిస్తున్న ఈ ఆసుపత్రి సేవలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. దేశంలోనే రెండో అత్యుత్తమ ఆంకాలజీ ఆసుపత్రిగా ఔట్ లుక్ ఇండియా మ్యాగజైన్ ఎంపిక చేసింది.
Basavatarakam Indo American Cancer Hospital:హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా కొన్ని దశాబ్దాలుగా వేలాది క్యాన్సర్ (Cancer) రోగులకు (Patients)సేవలు అందిస్తోన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి (Basavatarakam Indo American Cancer Hospital)జాతీయ (National) అవార్డు (Award)కి ఎంపికైంది. ఇండియా (India)లోనే రెండో అత్యుత్తమ ఆంకాలజీ(Ancology) ఆసుపత్రి (Hospital)గా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని అవుట్ లుక్ ఇండియా (Outlook India) మ్యాగజైన్ (Magazine)అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, వైద్య సిబ్బందిని అభినందించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకు ప్రాణం పోసింది. సినీహీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఛైర్మన్‌గా ఈ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. అలాంటి ఆసుపత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్ చేయటంలో ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. వృత్తిపరమైన నిబద్ధతతో, రోగుల పట్ల దయతో వ్యవహరిస్తూ.. వారి పట్ల అత్యంత శ్రద్ధ తీసుకుంటూ, అత్యాధునిక క్యాన్సర్ చికిత్స విధానాలు, చికిత్స వ్యవస్థలను పేదలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని కొనియాడారు. క్యాన్సర్ వ్యాధి చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని.., ఆ ఖర్చు భరించలేని వారికి బసవతారకం ఆసుపత్రి ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు