ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore) జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన 288 మంది ప్రాణాలను బలితీసుకుంది.ఘటన జరిగి వారం రోజులైనా ప్రమాద దృశ్యాలు ఇంకా ప్రజల కళ్ల ముందే మెదలాడుతున్నాయి. Odisha
ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore) జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో మృతిచెందిన వారి డెడ్‌బాడీస్ (Crash Victims Bodies) ని బహానగ ప్రభుత్వ పాఠశాలలో (Bahanaga High School) భద్రపరిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాఠశాలను అధికారులు కూల్చివేశారు. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. సుమారు 1000 మందికిపైనే గాయాలపాలయ్యారు. ఘటన జరిగి వారం రోజులైనా ప్రమాద దృశ్యాలు ఇంకా ప్రజల కళ్ల ముందే మెదలాడుతున్నాయి. ఇక ఈ ఘోర ప్రమాదంలో మృతిచెందిన వారి డెడ్‌బాడీస్ (Crash Victims Bodies) ని బహానగ ప్రభుత్వ పాఠశాలలో (Bahanaga High School) భద్రపరిచిన విషయం తెలిసిందే.
పిల్లలను తల్లి దండ్రులు స్కూల్ కు పంపేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారు.?
ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బహానగ పాఠశాలకు తరలించారు. అక్కడ నుంచి భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల తరలింపు తర్వాత పాఠశాలను శుభ్రపరిచారు. అయితే, అన్ని మృతదేహాలు ఒకే చోట చూడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవ్వడం. దీంతో విద్యార్థులను ఆ పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారట. విద్యార్థులు సైతం స్కూల్‌కు వెళ్లేందుకు భయపడిపోతున్నారట.
స్కూల్ ని కూల్చి వేయడానికి అసలు కారణాలు ఇవేనా..?
దీంతో పాఠశాలను కూల్చివేయాలని స్కూల్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే పరిశీలించిన అధికారులు పాఠశాలను కూల్చివేశారు(Train Accident Demolition Of School Where Dead Bodies Were Kept). 65 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాల దెబ్బతింది కాబట్టి.. దీనికి తోడు తాజా పరిస్థితుల నేపథ్యంలోనే ఈ పాఠశాలను కూల్చివేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు(teachers) ప్రమీలా స్వేన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఆ జిల్లా నుంచి ఓ యంత్రాంగం క్యాంపు ఏర్పాటు చేసింది. అయితే ప్రమాదంలో మృతి చెందిన వారీ డెడ్ బాడీలను అక్కడికి పంపియమని కోరింది. ఈ నేపథ్యంలో పాఠశాలలోని ప్రేయర్ రూంతో సహా.. కొన్ని తరగతి గదుల్లో కూడా మృతదేహాలను ఉంచారు. అయితే ఆ మృతదేహాలను కొన్నింటిని మార్చురీకి తరలించారు. అలా ఇది జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే మృతదేహాలు ఉంచిన పాఠశాలకు రావాలంటే అక్కడ ఉన్న విద్యార్థినులు(students) చాలా భయాందోళనకు గురవుతున్నారని చెప్పడం జరిగింది.అయితే ఆ పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని అదికారుల దృష్టికి తీసుకువెళ్ళడం. కొత్త భవనాలు నిర్మించిన తర్వాత పూజా కార్యక్రమాన్ని నిర్వహించి.. ఆ తర్వాత స్కూల్ పున:ప్రారంబిస్తామని ఆయన తెలిపారు. అయితే ఇంకా ఒరిస్సా రాష్ట్రవ్యాప్తంగా వేసవి సెలవులు జూన్ 19 వ తేదీన ముగియనున్నాయి ఆ తర్వాత స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలపడం జరిగింది.
షాక్ కు గురిచేసిన ఓడిశా రైలు ప్రమాదం
యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఒడిశా రైలు ప్రమాదం(Odisha Train Accident) ఘటన గత శుక్రవారం రాత్రి విషాదాన్ని నింపింది . బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్- చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు.. బాలాసోర్‌లోని బహనాగా బజార్ స్టేషన్‌కు సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. ప్యాసింజర్ రైళ్లల్లో సుమారు 2,500మంది ప్రయాణికులు ఉండగా.. 288మంది ప్రాణాలు కోల్పోయారు. 1000కిపైగా మంది గాయపడ్డారు.ఓ చిన్నపాటి నిర్లక్ష్యం వందల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. సిగ్నలింగ్ సిబ్బంది అలసత్వంతో 288 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోగా.. 1,175 మంది గాయపడ్డారు. కోరమాండల్ రైలు ప్రమాదంలో సాంకేతిక వైఫల్యాల కంటే మానవ తప్పిదమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అని చెప్పడం జరిగింది.. దేశ రైల్వే చరిత్రలోనే ఘోరాతిఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచింది. బాలాసోర్ సమీపంలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద షాలీమార్- చెన్నై కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు మెయిన్ లైన్లో వెళ్లడానికి సిబ్బంది గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, వెంటనే వెనక్కి తీసుకున్నారని తేలింది. దీంతో రైలు లూప్లైన్లోకి వెళ్లి అప్పటికే అక్కడ నిలిపి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టింది.
మానవ తప్పిదం వలన జరిగిన ప్రమాదం
గత 30 ఏళ్లలో మానవతప్పిదం వల్ల జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం ఇదే కావడం బాధాకరం. చివరిసారిగా 1985 ఆగస్టు 20న ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ సమీపంలో ఇటువంటి పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కాళింది ఎక్స్‌ప్రెస్ రైలును వేగంగా వచ్చిన పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 305 మంది ప్రాణాలు కోల్పోయారు. బాలాసోర్ జిల్లా ఆసుపత్రి బాధితుల ఆర్తనాదాలతో యుద్ధ రణక్షేత్రాన్ని తలపించింది. వందల మందికి ఒకేసారి చికిత్స అందించాల్సి రావడంతో వరండాలు కూడా కిక్కిరిసిపోయాయి. కటక్, భువనేశ్వర్, బాలాసోర్ ఆస్పత్రులు బయట తమవారికోసం వందలాదిగా చేరుకుని పడిగాపులు కాసారు. దాదాపు 500 మందికి ఒడిశాలో చికిత్స చేయడం.. మరో 390 మందిని మెరుగైన వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు తరలించారు.