Avinash reddy: గత నాలుగు రోజులుగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అంశంపై రగడ కొనసాగుతోంది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మరికాసేపట్లో తుది తీర్పు వెల్లడించనుంది.
Avinash reddy: గత నాలుగు రోజులుగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అంశంపై రగడ కొనసాగుతోంది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మరికాసేపట్లో తుది తీర్పు వెల్లడించనుంది. ఈక్రమంలో హైకోర్టు అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇస్తుందా.. ఇవ్వదా అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే గురువారం వెకేషన్ బెంచ్ ముందుకు రాకుండానే
బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది.
సమయం లేని కారణంగా అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. సాయంత్రం వరకూ విచారణకు రాకపోవడంతో రేపు ఉదయం వాదనలు వింటామని హైకోర్టు వెకేషన్ బెంచ్ తెలిపింది. గంట సమయం కావాలని సీబీఐ న్యాయవాదులు అడిగినప్పటికీ న్యాయవాదులు అందుకు న్యాయమూర్తులు అంగీకరించలేదు.
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీ ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను కేఏపాల్ అడిగి తెలుసుకున్నారు. గుండెపోటు రావడంతో కొద్దిరోజులుగా లక్ష్మీ విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మ, మేనత్త విమలారెడ్డితోపాటు పలువురు ఆమెను పరామర్శించారు. తాజాగా కేఏపాల్ కూడా ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించారు.
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హై కోర్టు వెకేషన్ బెంచ్ లో కాసేపట్లో వాదనలు జరగనున్నాయి.
వెకేషన్ బెంచ్ ముందు 77న నంబర్ ఐటమ్ గా అవినాశ్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ప్రస్తుతం ఇవాల్టి లిస్ట్ లో
50వ నంబర్ కేసు విచారణ జరుగుతోంది.
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి పాత్రధారి, ముఖ్యమంత్రి జగన్ సూత్రధారి అని ఆరోపించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. దైవం లాంటి కన్నతల్లిని అడ్డం పెట్టుకుని అవినాశ్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. కర్నూలు ఆసుపత్రి వద్దకు కడప రౌడీలను, అవినాశ్ అనుచరులను ఎందుకు తరలించారని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. అవినాశ్ ను అరెస్ట్ చేస్తారనే భయంతోనే వీరిని అక్కడకు తరలించారని ఎద్దేవా చేశారు. ఒకవేళ అవినాశ్ ను అరెస్ట్ చేస్తే... సీబీఐ అధికారులపై వీరితో దాడి చేయించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆసుపత్రి వైద్యులు గురువారం మధ్యహ్నం
ఆమె ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమెకు వాంతులు తగ్గాయని, ఐసియూ నుంచి గదిలోకి షిఫ్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని వైద్యులు తెలిపారు. గుండెకు రక్త సరఫరా మెరుగుపరచేందుకు ఆపరేషన్ అవసరం లేని వైద్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని హెల్త్ బులెటిన్ లో వైద్యులు వివరించారు.
అవినాశ్ తల్లి ఆరోగ్యంపై వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్
అవినాష్ రెడ్డి అరెస్ట్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ పై ఉత్కంఠ దేనికని ప్రశ్నించారు. సీబీఐ చేతకాని సంస్థ అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. సీబీఐ నిర్ణయించుకుంటే ఎవరు వచ్చినా.. ఏ స్థాయికి వెళ్లైనా సరే అరెస్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఫ్యాక్షనిజం ఒత్తిళ్లకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆగబోవు.. లొంగవు అని తెలిపారు. సీబీఐ నిర్ణయం తీసుకునేంత వరకూ ఓపిక పట్టాల్సిందే.. సీబీఐ ని ఏ శక్తీ ఆపలేదన్నారు.
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ లో సునీత ఇంప్లీడ్ అయ్యే అవకాశముంది. అవినాశ్‌కు ముందస్తు బెయిల్ ఇస్తే కేసులో జరిగే పరిణామాలను.. కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సీబీఐ, సునీతారెడ్డి చెబుతున్నారు.
అవినాశ్ బెయిల్ పిటిషన్ పై హై కోర్టు తీర్పు వెలువరచనున్న నేపథ్యంలో ఇప్పటికే సీబీఐ అధికారుల బృందం కర్నూలుకు చేరుకుంది. నాలుగు రోజుల నుంచి అవినాశ్ రెడ్డి కర్నూలులోనే ఉన్నారు. తల్లి చికిత్స పొందుతున్న విశ్వ భారతి ఆసుపత్రిలో నే ఉన్నారు. ఒక వేళ కోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తే అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.