అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం పరిసరాల్లోకి భారత సంతతికి చెందిన తెలుగు యువకుడు ట్రక్కుతో దూసుకురావడం కలకలం రేగింది
America : తెలుగు సంతతి కి చెందిన ఓ యువకుడు అమెరికా (America)అధ్యక్షడు జో బైడెన్‌ని (jo baidenni)హత్య చేసేందుకు ప్రయత్నం చేయటం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనమైంది. సోమవారం రాత్రి వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో(truck) దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టిన ఆ యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన సమయంలో ట్రక్కుపై నాజీ జెండాను పోలీసులు గుర్తించారు. ఈ దాడికి పాల్పడిన యువకుడిని భారత సంతతికి చెందిన తెలుగు కుర్రాడు సాయివర్షిత్ కందులగా పోలీసులు గుర్తించారు. అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్ చేశానని విచారణలో సాయిహర్షిత్ (Saiharshit) ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నిన కేసులు నమోదు చేశారు.
అసలేం జరిగింది…
సోమవారం రాత్రి 9:40 సమయంలో మిస్సౌరీలోని చెస్టర్ఫీల్డ్కు చెందిన సాయివర్షిత్ లాఫాయెట్ పార్క్‌కు సమీపంలో ఉన్న హెచ్ స్ట్రీట్ 1600 బ్లాక్‌లోని బోలార్డ్లపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రిపోర్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే U.S. పార్క్ పోలీసులు, U.S. సీక్రెట్ సర్వీస్ యూనిఫాం విభాగం అధికారులు అక్కడకు చేరుకున్నారు. దాడి చేసిన సాయి వర్షిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అభియోగాలేంటి?
అతన్ని విచారిస్తే అమెరికా అధ్యక్షుడిని , వైస్ ప్రెసిడెంట్‌ను కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ చంపేందుకు కుట్ర పన్నినట్టు తెలిసిందని పోలీసులు అభియోగాలు మోపారు. సాయి వర్షిత్‌ను అరెస్టు చేసిన సమయంలో ట్రక్‌లో నాజీ జెండాను గుర్తించినట్టు పోలీసులు వివరించారు. అమెరికా అధ్యక్షుడిపై దాడికి ఆరు నెలలుగా ప్లాన్ చేసినట్టు ఒప్పుకున్నాడని చెబుతున్నారు. ప్రమాదకరమైన ఆయుధంతో దాడి చేయడం, వెహికల్‌ను నిర్లక్ష్యంగా నడపడం, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లేదా వారి కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించడం, కిడ్నాప్ చేయడం లేదా హాని కలిగించడం, ప్రభుత్వం ఆస్తిని నాశనం చేయడం, చట్టాన్ని అతిక్రమించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు.
BREAKING 🚨 The moment U-Haul truck crashes near White House in Lafayette Square (Video: Chris) pic.twitter.com/Su5R5Q8QjQ
— Insider Paper (@TheInsiderPaper) May 23, 2023