హైదరాబాద్‌లోని హయత్ నగర్లో ఘోరం జరిగింది. నీడగా ఉందని అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్‌లో పడుకోబెడితే.. చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో పాప అక్కడికక్కడే దుర్మరణం చెందింది. హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లోని లెక్చరర్స్ కాలనీలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
Hyderabad: హైదరాబాద్‌లోని హయత్ నగర్లో ఘోరం జరిగింది. నీడగా ఉందని అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్‌లో పడుకోబెడితే.. చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో పాప అక్కడికక్కడే దుర్మరణం చెందింది. హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లోని లెక్చరర్స్ కాలనీలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ అపార్ట్మెంట్లో సెల్లార్లో పనులు జరుగుతున్నాయి. ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారిని వెంటబెట్టుకొని అక్కడ పనులు చేసేందుకు వచ్చింది. ఆ పాప అక్కడే కాసేపు ఆడుకుంది. నీడగా ఉందని సెల్లార్లో పడుకోబెట్టింది తల్లి.
కాసేపటి ఆ అపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ కారు.. సెల్లార్లోకి వచ్చింది. కారును నడుపుతున్న ఆ వ్యక్తి.. పార్కింగ్ ప్రదేశంలో చిన్నారిని చూడకుండా కారును ముందుకు తీసుకొచ్చాడు. కారు టైరు చిన్నారి మీద నుంచి పోవడంతో ఆ పాప అక్కడికక్కడే మృతి చెందింది. కర్ణాటకకు చెందిన కొడ్లి రాజు, కవితా దంపతులు బీఎన్‌రెడ్డి నగర్లో ఉంటూ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. బిడ్డనుకోల్పోయిన తల్లిదండులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చిన్నారి బంధువులు అపార్ట్మెంట్ వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.