The Kashmir Files: 69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వివిధ కేటగిరీల్లో పురస్కారాలని దక్కించుకుని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ అవార్డుల్లో తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన హిందీ చిత్రం `ది కశ్మీర్ ఫైల్స్` కు రెండు పురస్కారాలు లభించాయి.
The Kashmir Files: 69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వివిధ కేటగిరీల్లో పురస్కారాలని దక్కించుకుని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ అవార్డుల్లో తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన హిందీ చిత్రం `ది కశ్మీర్ ఫైల్స్` కు రెండు పురస్కారాలు లభించాయి. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా `ది కశ్మీర్ ఫైల్స్`కు, ఇందులో నటించిన పల్లవి జోషీకి ఉత్తమ సహాయ నటిగా రెండు విభాగాల్లోనూ అవార్డులు దక్కాయి.
దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. జాతీయ పురస్కారాల్లో తమిళ సినిమాలకు అవార్డులు దక్కకపోవడం, `ది కశ్మీర్ ఫైల్స్` లాంటి సినిమాలకు రెండేపసి అవార్డులు రావడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రచారంపై `ది కశ్మీర్ ఫైల్స్` నిర్మాతలలో ఒకరైన అభిషేక్ అగర్వాల్ స్పందించారు. `ది కశ్మీర్ ఫైల్స్` సినిమాకు రెండు జాతీయ అవార్డులు రావడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సినిమా ప్రారంభం నుంచి తమకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, సినిమా చూసిన కొందరు యాంటీ ముస్లీం అంటూ కామెంట్‌లు చేశారని వాపోయారు. ఈ విధంగా ఎలా కామెంట్‌లు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. `ది కశ్మీర్ ఫైల్స్` యాంటీ టెర్రిరిజం నేపథ్యంలో రూపొందిందని, ఈ సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, సినిమాకు అవార్డులు రావడంతో ఆయన చాలా ఆనందంగా ఉన్నారని తెలిపారు.
తెలుగు సినిమా రాష్ట్రాన్ని దాటి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటోందన్నారు. కొందరు రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి నిజం లేదన్నారు. నేను ఎప్పటికీ రాజకీయాలకు దూరమే అన్నారు. ఇక అవార్డుల లాబీయింగ్ గురించి వస్తున్న విమర్శలపై మాట్లాడుతూ ` అవార్డ్స్ కోసం మేము ఎలాంటి లాబీయింగ్ చేయలేదని, అసలు అలాంటి విషయాలు తనకు తెలియదని తమ సినిమాపై వస్తున్న విమర్శలని నిర్మాత అభిషేక్ అగర్వాల్ కొట్టి పారేశారు.