Amit shah : అమిత్‌షా పర్యటనలో హోర్డింగ్‌ల కలకలం
Amit shah : నిన్న కవిత ఈడీ విచారణకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు BRS శ్రేణులు. బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆందోళనలు నిర్వహించారు. రాజ్‌భవన్ గోడకు ఫిర్యాదు కాపీని అంటించారు. కాగా కేంద్రమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్‌ఐఎస్‌ఏ) క్యాంపస్‌లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) 54వ రైజింగ్ డే పరేడ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించనున్నారు. కాగా పర్యటన నేపథ్యంలో నగరంలో వెలిసిన పోస్టర్స్.. కలకలం సృష్టిస్తున్నాయి. హిమంత బిశ్వశర్మ, నారాయణ్ రాణె, సువేందు అధికారి, సుజనాచౌదరి, జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు నేతల ఫొటోలతో పోస్టర్లు పెట్టారు.
నిర్మా సర్ఫ్‌తో బట్టలపై మరకలు మాయమై పోయినట్లు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బీజేపీలో చేరితే వారికి అంటిన మరకలు కూడా పోతాయని చురకలంటిస్తూ అమిత్ షా పర్యటిస్తున్న మార్గాల్లో పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇక నిన్న ఢిల్లీలో బైబై మోదీ అంటూ పోస్టర్లు ఏర్పాటుచేశారు. బీజేపీలో చేరగానే కేసులు మాయమంటూ..ఇటీవల బీజేపీలో చేరిన పలువురి ఫొటోలను ప్రదర్శించారు.