నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఈనెల 28వ తేదీన ఈ పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారు. దేశంలోని అన్ని పక్షాలకు ఇప్పటికే ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది.
New Parliament Inauguration: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఈనెల 28వ తేదీన ఈ పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారు. దేశంలోని అన్ని పక్షాలకు ఇప్పటికే ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. మరో వారం రోజుల్లో ఈ భవనాన్ని ప్రారంభం కాబోతున్నది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా చేస్తున్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 9 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అయితే, ప్రధాని పార్లమెంట్ భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలకు ప్రభుత్వం ఆహ్వానాలను పంపింది.
కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం, పైగా దేశ పార్లమెంట్ కు సంబంధించిన అంశం కావడంతో అన్ని పార్టీలు స్కిప్ కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. హాజరు అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి తప్పనిసరిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరవుతారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతూ వస్తున్నది. ప్రధాని పర్యటనలకు సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదు. ప్రభుత్వం తరపున మరో ప్రతినిధిని పంపుతున్నారు. ఢిల్లీ పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక, ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి టీఎంసీ హాజరుకావడం లేదని స్పష్టం చేసింది. తమకు అభ్యంతరాలు ఉన్నాయని, అందుకే హాజరుకావడం లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికల్లో టీఎంసీకి బీజేపీ తీవ్రమైన పోటీని ఇచ్చింది. 2 సీట్ల నుంచి 70 సీట్లను గెలుచుకోవడం, పార్లమెంటులో 18 సీట్లను గెలుచుకోవడంతో మమత అలర్ట్ అయ్యారు. ప్రధాని మోడీని వ్యతిరేకించే పార్టీలతో చేతులు కలుపుతున్నారు.