ముంబయి ధరావీలోని మురికి వాడలో పుట్టి పెరిగిన మలీషా ఖర్వా . అమెరికన్ నటుడు రాబర్ట్ హాఫ్ మ్యాన్ చొరవతో 2020 లో ప్రపంచం దృష్టిని ఆకర్షించిది. ఇప్పుడు ఈ 14 ఏళ్ల అమ్మాయి ఫారెస్ట్ ఎసెన్షియల్స్ అనే ఉత్పత్తుల బ్రాండ్ కు మోడల్ గా ఎంపికై చరిత్ర సృష్టించింది.
ముంబయి(Mumbai) ధరావీలోని మురికి వాడలో పుట్టి పెరిగిన మలీషా ఖర్వా(malisha karwa) . అమెరికన్ నటుడు రాబర్ట్ హాఫ్ మ్యాన్ (Robert Hoffman)చొరవతో 2020 లో ప్రపంచం దృష్టిని ఆకర్షించిది. ఇప్పుడు ఈ 14 ఏళ్ల అమ్మాయి ఫారెస్ట్ ఎసెన్షియల్స్ అనే ఉత్పత్తుల బ్రాండ్ కు మోడల్ గా ఎంపికై చరిత్ర సృష్టించింది. అమెరికన్ నటుడు రాబర్ట్ హాఫ్ మ్యాన్ దృష్టిలో పడకముందు మలీషా ఖర్వా((malisha karwa)) ముంబయి ధరావీలో తన కుటుంబంతో సముద్రం పక్కనున్న ఒక తాత్కిలిక ప్రదేశంలో నివసించే ఒక సాదాసీదా అమ్మాయి. అయితే అప్పటి నుండి సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిన ఈ అమ్మాయి తాజాగా మరో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రిన్సెస్ ఫ్రమ్ ది స్లమ్స్ అనే పేరుతో ప్రజాదరణ పొందిన మలీషా 253 కోట్లు కలిగిన ప్రముఖ ప్రఖ్యాత స్కిన్ కేర్ కంపెనీ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ప్రమోషన్ కు ఎంపికైంది. యువతి సెలక్షన్స్ అనే కొత్త క్యాంపెస్ కోసం ఈ కంపెనీ మలీషాను ఎంపిక చేసుకుంది. స్టోర్స్ లో కనిపిస్తున్న మలీషా ఫోటోలను చూసిన నెటిజన్లు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గోఫండ్ మి ద్వారా
మలీషాను((malisha karwa)) బయటి ప్రపంచానికి పరిచయం చేసిన అమెరికన్ నటుడుఈ అమ్మాయి కోసం గోఫండ్ మి అనే అకౌంట్ ను సృష్టించి దాన్లో రోజుకు రెండు పూటలు భోజనం దోరకడం విలాసవంతమైన జీవితాన్ని గడపడంతో సమానంగా భావించే మలీషా ఎంతో పేద కుటుంబానికి చెందింది. మలీషా గురించి వివరిస్తూ లక్ష్యాలు,జీవన విధానం గురించిన వివరాలు చెప్తుంటారు. అలాగే మలీషా పేదరికం గురించి,మురికి వాడ పట్ల తనకున్న ప్రేమ గురించి గోఫండ్ మి పేజీలో వివరించింది.మురికివాడల్లో నివసించడం భాదగా వుందా..? అని ఎంతో మంది మలీషా ని అడుగుతు వుంటారట. నిజానికి ఈ ప్రశ్న మలీషా ని అయోమయానికి గురి చేస్తు వుంటుందట. మలీషా కర్వా తన ఇల్లంటే తనకు ఇష్టమట. ఎందుకంటే నివసించేది దాన్లోనే! అ అమ్మాయి జీవితంలో నచ్చని అంశం ఏమిటి అంటే ఎన్నో సార్లు తమ్ముడు నేను ఆహారం లేక పస్తులు వుండటం. ఆఖరుకు నీళ్లు దొరకడం కూడా కష్టంగా మారేది. వర్షాకాలం వచ్చిందంటే ఇంటికి పై కప్పు లేదు కాబట్టి నిద్రపోవడం కష్టంగా వుండేదట.
మలీషా కి మోడలింగ్ ఇష్టమనే తెలుసుకున్నది ఎవరు..?
వర్షం నీళ్ళను అడ్డుకోవడం కోసం పై కప్పు మీద టార్పాలిన్ కూడా కొట్టుకుపోతూ వుండేది. అని గోఫండ్ మి పేజ్( go fund me page Maleesha Kharwa’s) లో చెప్పుకొచ్చిన మలీషా,ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి రోజూ ఇంటి పనుల్ని స్వయంగా చేసుకుంటూ వుంటుంది. మలీషా కు మోడలింగ్ డాన్స్ అంటే ఇష్టమని మాటల్లో తెలుసుకున్న హాఫ్ మ్యాన్ ఆ అమ్మాయికి మద్దతివ్వాలని నిర్ణయించుకుని,ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సృష్టించాడు. మలీషా ఇప్పటికే ఎన్నో ప్రధాన ప్రకటనల్లో కనిపించడమే కాకుండా,కాస్మోపాలిటన్ ,పీకాక్ లాంటి ప్రధాన ప్రకటనల్లో కనిపించడమే కాకుండా ప్రధాన ప్రతికల ముఖ చిత్రాలకు ఫోజులు ఇచ్చింది. తాజగా రెండు రెండు హాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.
మలీషా లివ్ యువర్ ఫెయిరీ టేల్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది. ఐదుగురు పేద పిల్లల మొట్టమెదటి డిన్నర్ అనుభవం చుట్టూ తిరిగే కథ ఇది. మలీషా తన వ్లాగ్ ద్వారా యూట్యూబ్ లో తన వ్యూవర్లతో మాట్లాడుతూ వుంటుంది. ఆ వ్లాగ్ ద్వారా వ్యక్తిగత కథలనూ,రోజువారి పనులను పంచుకుంటూ వుంటుంది. తన క్యాంపెయిన్ ఫోటోలను ప్రదర్శించే స్టోర్ లోకి అడుగు పెడుతున్న మలీషా తాజా ఇన్ స్టాగ్రామ్ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోలో కలలు నిజమైనందుకు మలీషా ముఖం వెలిగిపోవడం స్పష్టంగా కినిపించింది. కలలు నిజమవుతాయనే నానుడికి మలీషా కథ చక్కని ఉదాహరణ. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ,మలీషా ఫోటోకు..బికాజ్ యువర్ డ్రీమ్ మ్యాటర్స్ అనే క్యాప్షన్ రాయడం మరొక చెప్పుకొదగిన విషయం.