R5 ZONE LANDS: అమరావతి (Amaravati)లో ఆర్-5 జోన్ (R5Zone) పరిధిలో ఏపీ (AP)ప్రభుత్వం (Government)ఇళ్ల పట్టాల పంపిణీ చేయటంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. భూముల (Lands) పంపిణీకి వ్యతిరేకంగా రాజధాని (Capital) రైతులు (Formers) తీవ్ర నిరసన తెలిపారు. తుళ్లూరు (Tullur) మండలం వెంకటపాలెంలో పట్టాలు పంపిణీ చేస్తున్న సమయంలో అమరావతి పరిధిలోని వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు. నల్లబెలూర్లు, నల్ల జెండాలు ఎగరేసి నిరసన తెలిపారు.
నల్ల రిబ్బన్లతో నిరసన
అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు, మందటంలో ఇళ్లు, దుకాణాలపై నల్ల జెండాలు ఎగురవేశారు. దీక్షా శిబిరం వద్ద ఉరితాళ్లతో నల్లరిబ్లన్లను కట్టుకుని నిరసన తెలిపారు. పేదలారా.. మరోసారి మోసపోవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అమరావతిని విచ్ఛిన్నం చేసే సీఎం గో బ్యాక్, రాజధాని ద్రోహులు గో బ్యాక్, అమరావతిని నిర్మించండి.. ఆంధ్రప్రదేశ్ కాపాడండి అంటూ నినాదాలు చేశారు.
అమరావతి మందడంలో నల్ల బెలూన్లతో నిరసన తెలుపుతున్న రైతులు
పోలీసుల అప్రమత్తం.. నేతల నిర్బంధం
అయితే మందడంలోని దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులు బయటకు రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో సుమారు 3వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి రైతుల ఆందోళనపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. అమరావతి జేఏసీ నేతలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ముందుగానే వారిని గృహ నిర్బంధం చేశారు. అమరావతి బహుజన ఐకాస నేత పోతుల బాలకోటయ్యను స్వస్థలమైన కంచికచర్లలో హౌస్ అరెస్ట్ చేశారు.