కొత్త పార్లమెంట్ (New Parliament)ని ప్రధాని (PM) మోదీ (MODI) ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ (Petition)ను విచారించేందుకు సుప్రీంకోర్టు (Supreem Court) తిరస్కరించింది.
New Parliament: కొత్త పార్లమెంట్ (New Parliament)ని ప్రధాని (PM) మోదీ (MODI) ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ (Petition)పై విచారణను సుప్రీంకోర్టు (Supreem Court) తిరస్కరించింది. పార్లమెంట్‌ని రాష్ట్రపతి (President)ద్రౌపది ముర్ము ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఓ లాయర్ (Lawer)ఈ పిటిషన్ వేశారు. శుక్రవారం పిటిషన్ల లిస్ట్‌లో ఉన్నప్పటికీ…సర్వోన్నత న్యాయస్థానం విచారణకు అంగీకరించలేదు. ఇలాంటి పిటిషన్ వేసినందుకు మేమెందుకు మీకు ఫైన్ (Fine)వేయకూడదదంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ సమయంలో ధర్మాసనం అసహనానికి గురైంది. ఈ విషయంలో జోక్యం చేసుకోమని,ఇది సుప్రీంకోర్టు కలగజేసుకోవాల్సిన విషయం కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగప్రకారం అధినేత రాష్ట్రపతి అవుతారని, అదే పరిపాలనా పరమైన విషయాల్లోకి వస్తే ప్రధాని చీఫ్ అవుతారు. ఇందులో విచారించాల్సినంత విషయం ఏమీ కనిపించడం లేదని, అందుకే పిటిషన్‌ని తిరస్కరిస్తున్నామని కోర్టు పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యల తరవాత పిటిషనర్ తన పిటిషన్‌ని విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.