ఈ రోజు రాశిఫలాలను చూస్తే మిశ్రమ ఫలితాలతో ఉత్సాహంగా వుంటారు.మే 26-2023, శుక్రవారం,రాశిఫలాలు
మేషరాశి
సన్నిహితులతో వివాదాలు.ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు .ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ,కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్ధులకు అంచనాలు తప్పుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. అంతా మంచే జరుగుతుంది.
వృషభరాశి
దూరపు బంధువుల కలయిక. ఇంటిలో శుభాకార్యాల నిర్వహణ. అప్రయత్న కార్య సిద్ధి. విలువైన వస్తువులు,వాహనాలు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోంటారు. మిత్రులతో వివాదాలు తీరుతాయి. భూముల క్రయవిక్రయాలలో అనుకున్న అభాలు తథ్యం. కొత్త వ్వాపారాలకు శ్రీకారం చుడుతారు. ఉద్యోగస్థులకు ఇంక్రీమెంట్లు లభిస్తాయి. రాజకీయ వేత్తలకు ఆహ్వానాలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పఠించండి.
మిథునరాశి
రుణ ఒత్తిడులు.దూర ప్రయాణాలు.పనులు వాయిదా వేస్తారు. మిత్రులు,బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లు కొన్ని చిక్కులు ఎదురుకుంటారు. వ్వాపారాలు నత్తనడక సాగుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.రాజకీయ సాంకేతిక రంగాల వారికి ఒత్తిడులు. విద్యార్ధులకు చికాకులు తప్పవు. గణపతిని ఆరాధించండి.
కర్కాటక రాశి
ఒక ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్ధిక విషయాలు ఆశాజనకంగా వుంటాయి. సన్నిహితులతో వ్వక్తిగత విషయాలు చర్చిస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. కొన్ని వివాదాలు కొంత చిరాకు పరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపార ,వాణిజ్య వేత్తలు మరింత ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కీలక సమాచారం రావచ్చు. విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి. కుటుంబంలో మరింత ఒత్తిడులు, శ్రమ మరింత పెరుగుతుంది.
సింహం రాశి
బందువులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. కుటుంబ సమస్యలు తొలుగుతాయి. ఒక ప్రకటన విశేషంగా ఆకట్టుకుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. విద్యార్ధులు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. హనుమాన్ చాలీసా పఠించండి..
కన్యా రాశి
ఇంటా బయటా ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా వుంటుంది. కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. ఆశ్చర్యకరంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు. రాజకీయ ,పారిశ్రామిక వేత్తలకు శుభవార్తలు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
తుల రాశి
పనుల్లో విజయం.శుభాకార్యాల్లో పాల్గోంటారు. పాతబాకీలు వసూలు అవుతాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గోంటారు. మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు. ఆలయాలు సందర్శిస్తారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో వున్నత హోదాలు.పారిశ్రామిక వర్గాల వారికి అవకాశాలు దగ్గరగా వస్తాయి. అంగార స్తోత్రాలు పఠించండి.
వృశ్చిక రాశి
మిత్రులతో వివాదాలు,కలహాలు.దూరప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా సమస్యలు పెరుగుతాయి. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్వాపారాలలో చికాకులు.ఉద్యోగులకు స్థాన మార్పులు. పారిశ్రామిక వేత్తలకు నిరుత్సాహం.విద్యార్ధుల కృషి అంతగా పలించదు. గణపతిని పూజించండి.
ధనస్సు రాశి
బంధువుల నుండి సమస్యలు ఎదురవుతాయి. రాబడి కన్నా ఖర్చులు అధికమవుతాయి. పనుల్లో అవరోధాలు. వ్యయప్రయాసలు తప్పవు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా వుంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక లాభాలు ,మార్పులు వుండవచ్చు. విద్యార్ధులకు అంచనాల్లో పొరపాట్లు. ఆంజనేయ దండకం పఠించండి.
మకర రాశి
బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. రావాల్సిన బాకీలు వసూలే అవుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఒడ్డున పడుతారు. ఆధ్యాత్మిక చింతన .వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అవరోదాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించండి.
కుంభ రాశి
కొత్త పనులు చేపడుతారు. ఆలోచనలు కలిసి వస్తాయి. గృహంలో శుభకార్యాల నిర్వహణ. ఆర్ధిక లావాదేవీలు సంతృప్తికరంగా వుంటాయి. ప్రత్యర్ధుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
మీన రాశి
కుటుంబ సభ్యులతో వివాదాలు.ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు వాయిదా పడుతాయి. శ్రమానంతరం పనులు వాయిదా పూర్తవుతాయి. రాబడి తగ్గి నిరాశ చెందుతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.విద్యార్ధులకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. హనుమాన్ చాలీసా పఠించండి.