కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో కొత్త ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ తెలంగాణ నేతల్లో సీఎం అభ్యర్థి ఎవరా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే తాను ఆ రేసులో లేనంటూ కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది.
KomatiReddy On CM Post: సీఎం (CM) అభ్యర్థి ఎవరన్న అంశంపై తెలంగాణ (TELANGANA) కాంగ్రెస్ (CONGRESS) పార్టీ (PARTY)లో చర్చోప చర్చలు జరుగుతుండగా ఎంపీ (MP) కోమటి రెడ్డి వెంకటరెడ్డి (KOMATI REDDY VENKTA REDDY) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం పదవి అవసరం లేదన్న కోమటిరెడ్డి.. ఆ పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఏరోజూ పదవుల కోసం ఆశపడలేదని.. పదవులే తనను వెతుక్కుంటూ వచ్చాయని పేర్కొన్నారు. తాను సీఎం పదవి కోసం పాకులాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సీఎం ఎవరన్న అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దళిత అభ్యర్థిని సీఎం చేయాలన్న కామెంట్లతో అగ్గిరాజేసేసిన కోమటి రెడ్డి మంగళవారం తన బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద కృష్ణా జలాలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజలు చేశారు. ఇది ఆయనకు 60వ పుట్టినరోజు. దాదాపు 500 కార్ల భారీ కాన్వాయ్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అనుచరులతో కలిసి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.