CM Kejrwial meeting with CM KCR: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కానున్నారు. కేంద్రం పైన పోరులో భాగంగా మద్దతు దారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతలో కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సమయంలోనూ ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్ తో మంతనాలు చేసారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కేజ్రీవాల్ హాజరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ తో దూరం పాటిస్తున్న కేజ్రీవాల్ ..తన లైన్ లో కొనసాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాజా పరిణామాలు..మద్దతు సమీకరణ పైన చర్చలు చేయనున్నారు.
ఢిల్లీ ప్రభుత్వం వర్సస్ కేంద్రం గా ప్రస్తుతం పోరాటం మారింది. కేంద్రం తీసుకొచ్చిన తాజా ఆర్డినెన్స్ తాజా వివాదానికి కారణమైంది. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్ లపై కేంద్రం ఆర్దినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ పార్లమెంట్ లో ఆమోదం పొందకుండా కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం థాక్రేతో కలిసి చర్చించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమయ్యారు.ఇప్పుడు దీనికి కొనసాగింపుగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశం కానున్నారు.
కొద్ది రోజుల క్రితం మనీష్ సిసోడియా అరెస్ట్ వ్యవహారంలో విపక్షాలు అన్నీ మద్దతు ప్రకటించాయి. ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో కేంద్ర విచారణ సంస్థలు మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసాయి. కేంద్రం విచారణ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తోందంటూ ప్రతిపక్షాలు ప్రధాని మోదీ పైన ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఇప్పుడు ఢిల్లీ ఆర్డినెన్స్ పైన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో పాటుగా ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీతోనూ సమావేశం కానున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేసారు. ఢిల్లీ ఆర్డినెన్స్ పైన వారితో చర్చించి ప్రజాస్వామ్య పరిరక్షణలో వారి మద్దతు కోరుతానని స్పష్టం చేసారు. కాంగ్రెస్ తో కేజ్రీవాల్ దూరంగానే ఉంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ సమదూరం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్ర నేతలకు కలిసి సమాఖ్య నిర్మాణంపై జరుగుతున్న దాడి, ప్రస్తుత రాజకీయ పరిణామాలను చర్చించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీలను కలవడానికి తీసుకున్నట్లు కేజ్రీవాల్ స్పష్టం చేసారు. ఇప్పుడు కేసీఆర్ తో సమావేశం సమయంలో జాతీయ రాజకీయాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. మరి కొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తెలంగాణలో రాజకీయంగా ప్రత్యర్ధి పార్టీలకు అవకాశం లేకుండా కేసీఆర్ రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధాని నూతన పార్లమెంట్ ప్రాంభోత్సవానికి 19 ప్రతిపక్ష పార్టీలు దూరంగా ఉంటున్నాయి. బీఆర్ఎస్ నిర్ణయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Meeting Hon’ble CM of Telengana tomo in Hyderabad to seek support against unconstitutional and undemocratic ordinance passed by BJP govt against the orders of Hon’ble SC.
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 26, 2023
Sought time this morning to meet Cong President Sh Kharge ji and Sh Rahul Gandhi ji to seek Cong support in Parl against undemocratic n unconstitutional ordinance passed by BJP govt and also to discuss general assault on federal structure and prevailing political situation
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 26, 2023