దేశరాజధాని ఢిల్లీలో జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 summit) జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Xi Jinping: దేశరాజధాని ఢిల్లీలో జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 summit) జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో (Delhi) కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పాట హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఈ సమావేశాలకు పలు దేశాల అధిపతులు హాజరు కాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదని ప్రకటించారు. స్వయంగా ప్రధాని మోడీకే ఫోన్ చేసి ఈ విషయం చెప్పినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అయితే ఇప్పుడు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) కూడా జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. ముందుగా షీ జిన్ పింగ్ సదస్సుకు హాజరవుతారని అందరూ భావించారు. చైనా, భారత్ సరిహద్దు వివాదం నేపథ్యంలో.. మోడీ, జిన్‌పింగ్ సమావేశమై ద్వైపాక్షిక సమావేశాలు జరిపే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు షీ జిన్ పింగ్ జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ సమావేశాలకు హాజరు కానున్నట్లు సమాచారం.