Monkeypox: గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్
World Health Organisation announces monkeypox as a global emergency: మంకీపాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. WHO శనివారం మంకీపాక్స్ కారణంగా ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దీనికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంకీపాక్స్ విజృంభించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజారోగ్యానికి సంబంధించి ఎమర్జెన్సీ విధిస్తున్నామని ఆయన ప్రకటించారు. డాక్టర్ టెడ్రోస్ మాట్లాడుతూ, ఒక నెల క్రితం నేను అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం అత్యవసర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశామని అప్పుడు మంకీపాక్స్ విజృంభించడం వల్ల గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా లేదా అని అంచనా వేశామని అన్నారు.
ఆ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మంకీపాక్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కలిగించదని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆ సమయంలో, 47 దేశాల నుండి WHOకి 3040 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని అన్నారు. అప్పటి నుండి దాని వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది అని ఇప్పుడు 75 దేశాలలో 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని దాని కారణంగా ఐదు మరణాలు సంభవించాయని అన్నారు. మంకీపాక్స్ వ్యాప్తికి సంబంధించిన అనేక అంశాలు “అసాధారణమైనవి” అని అత్యవసర కమిటీ గుర్తించిందని, మంకీపాక్స్ ప్రమాదాలను సంవత్సరాలుగా పరిష్కరించలేదని ఆయన అన్నారు.
మంకీపాక్స్కు సంబంధించిన డేటాను ఈ గురువారం మరోసారి సమీక్షించానని, సలహా ఇచ్చేందుకు కమిటీని పునర్నిర్మించానని ఆయన చెప్పారు. ఈరోజు మనం ప్రచురిస్తున్న నివేదికలో కమిటీ సభ్యులు దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా కారణాలు చెప్పారని అన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం, ఎమర్జెన్సీ నిర్ణయించడంలో ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని డాక్టర్ టెడ్రోస్ చెప్పారు. మొదటిది దేశాలు అందించిన సమాచారం,