Gina Lolo Brigida: ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళమృతి ..విషాదంలో అభిమానులు
Gina Lolo Brigida: ఆమె ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళ.. ప్రపంచం మొత్తంగా అత్యధికంగా అభిమానులున్నది కూడా ఆమెకే ఎన్నో సినిమాలలో నటించి ఆమె ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చుకుంది. ఈ అందమైన మహిళ నిన్న రోమ్‌లో మరణించారని తెలుస్తుంది. నటి గినా లోలోబ్రిగిడా 1950లు మరియు 60లలో యూరోపియన్ చలనచిత్ర రంగంలో అతిపెద్ద తారలలో ఒకరిగా పేరొందారు.
1927 జులై 4 వ తేదీన గినా లోలోబ్రిగిడా జన్మించారు. 1950నుండి దాదాపు ఓ దశాబ్దం పాటుసినిమాలలో నటించి అత్యధికంగా అభిమానులను సంపాదించుకుంది యూరోపియన్ సినిమాల్లో బిగ్గెస్ట్ స్టార్ గా వెలుగొందింది. అమెరికన్ సినిమాల్లోనూ నటించింది. 1960 తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆతర్వాత మెల్లి మెల్లిగా సినిమా కెరీర్ నుండి రాజకీయంగా ఎదిగారు. 1953 జాన్ హస్టన్ చిత్రం; మరియు 1969లో ఉత్తమ నటిగా లోలోబ్రిగిడా ఇటలీ యొక్క టాప్ మూవీ అవార్డ్ డేవిడ్ డి డోనాటెల్లో గెలుచుకున్నబునా సెరా, మిసెస్ కాంప్‌బెల్ నటించింది. ఆమె మరణంతో ఆమె అభిమానులు విషాదంలో మునిగారు.