US Senate Key Decision on Mc Mohan line: భారత్ చైనా సరిహద్దు రేఖపై అమెరికా సెనెట్ కీలక తీర్మానం
US Senate Key Decision on Mc Mohan line: ఇండియా చైనా దేశాల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌కు స్వతంత్రం వచ్చిన సమయంలో హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లోని కొంత భాగాన్ని ఆ దేశం ఆక్రమించుకుంది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోని భూభాగమని వాదిస్తూ వస్తున్నది. లఢఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సుదీర్ఘమైన సరిహద్దు వెంబడి భారత్ పహారాను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, భారత్ చైనా సరిహద్దు వెంబడి ఉన్న మెక్ మోహన్ లైన్‌ను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తూ అమెరికా సెనెట్ తీర్మానం ప్రవేశపెట్టింది.
రిపబ్లిక్ పార్టీ సెనెటర్ బిల్ హరెర్తీ, డెమోక్రాటిక్ సెనెటర్ జెఫ్ మెర్క్‌లీలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ఆమోదం పొందడంతో అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్లు అమెరికా పేర్కొన్నది. ఇండో పసిఫిక్ తీరంలో చైనా ఆగడాలు పెరిగిపోతున్న సమయంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. 1914లో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వానికి చెందిన మెక్‌మోహన్ టిబెట్ తూర్పుప్రాంతం నుండి బ్రహ్మపుత్రా నది మీదుగా టిబెట్ వరకు 890 కిమీ మేర సరిహద్దును నిర్ణయించారు. టిబెట్ తూర్పుప్రాంతం, తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగంగా ఆనాడు టిబెట్ ఒప్పుకుంది. కాగా, నేడు తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్‌లు తమవేనని చైనా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా సెనెట్ మెక్‌మోహన్ లైన్‌ను వాస్తవాధీన రేఖగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.