Joe Biden: భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు
Joe Biden: అమెరికా ప్రభుత్వంలో భారతీయులకు దక్కుతున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎంతో మంది భారత సంతతికి చెందిన వారు యూఎస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ జాబితాలోకి తాజాగా మరో ఇద్దరు వచ్చి చేరారు. ఇప్పటికే పలువురు భారతీయ అమెరికన్లకు పలు కీలక బాధ్యతలు అప్పగించిన అమెరికా అధ్యక్షుడు భారత సంతతి కి ఎక్కువప్రాధాన్యత ఇస్తున్నారు.
నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ సీఈఓ మనీశ్ బప్నాకు సలహాదారు బాధ్యతలను అప్పగిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఫ్లెక్స్ చీఫ్ రేవతి అద్వైతిలకు వర్తక విధానం, సంప్రదింపుల సలహా కమిటీలో చోటు కల్పించారు. ఈ కమిటీ యూఎస్ వర్తక విధానాలు, పాలన, అమలు తదితరాలపై సలహాలు సూచనలు చేస్తుంది. ఈ సందర్భంగా అమెరికా అధికార భవనం వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఫార్చున్ పత్రికకు చెందిన శక్తిమంతమైన మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో వరుసగా నాలుగేళ్ల పాటు కొనసాగారు రేవతి.
మనీశ్ పర్యావరణ ప్రధానమైన పలు చట్టాల రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషించారు. ఎమ్ఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్, ఎకనమిక్ డవలప్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఇప్పుడు వీరిద్దరికి అగ్రరాజ్యం ప్రభుత్వంలో కీలక బాధ్యతలను అప్పగించింది.