Report on Covid 19 Virus: యూఎస్ ఎనర్జీ రిపోర్ట్… వైరస్ ల్యాబ్ నుంచే లీక్
Report on Covid 19 Virus: 2020లో ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడించింది. ఈ వైరస్ ధాటికి ప్రపంచంలోని అన్ని దేశాలు వణికిపోయాయి. వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడ్డారు. లక్షలాది మంది ఉపాధి అవకాశాలను కోల్పోయారు. విలువైన జీవితాలను కోల్పొయారు. ఇక కరోనా కారణంగా 67 కోట్ల మందికి పైగా ప్రజలు ఎఫెక్ట్ కాగా, 70 లక్షల మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ మహమ్మారి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. యూరప్, అమెరికా, సౌత్ అమెరికా, తైవాన్, రష్యా వంటి దేశాల్లో కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రోజువారి కేసులు పెద్ద సంఖ్యలోనే మళ్లీనమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ సంస్థ కరోనా మహహ్మారిపై రిపోర్ట్‌ను తయారు చేసింది. ఈ రిపోర్ట్‌ను వైట్ హౌస్, యూఎస్ కాంగ్రెస్ సభ్యులకు అందజేసింది. ఈ నివేదిక ప్రకారం ఈ వైరస్ మహమ్మారి వూహాన్‌లోని ల్యాబ్ లో జరిగిన ప్రమాదం కారణంగా వైరస్ లీక్ అయ్యి బయటకు వచ్చిందని స్పష్టం చేసింది. ఈ లీకేజీని గుర్తించడంలో చైనా విఫలం అయిందని, ఫలితంగా మహమ్మారి క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరించి 70 లక్షల మంది ప్రాణాలను హరించినట్లు నివేదికలో పేర్కొన్నారు.