US Air Strike in Somalia: సోమాలియాలో యూఎస్ ఎయిర్‌ఫోర్స్ దాడులు… 30 మంది మృతి
US Air Strike in Somalia: ఆఫ్రికాదేశం సోమాలియాలో ఉగ్రవాదులు రోజు రోజుకు పేట్రేగిపోతున్నారు. విధ్వంసాలు సృష్టిస్తున్నారు. నిత్యం దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తీవ్రవాదులకు, ప్రభుత్వ దళాలకు మధ్య నిత్యం పోరు జరుగుతూనే ఉన్నది. సాధారణ పరిపాలనకు ఆటంకాలు ఎదురౌతున్న నేపథ్యంలో యూఎస్ ఆర్మీ సోమాలియాలో రంగంలోకి దిగింది. సోమాలియా తీవ్రవాదులపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు 30 మంది తీవ్రవాదులు మరణించారని యూఎస్ ఎయిర్‌ఫోర్స్ తెలియజేసింది. ఈ దాడుల్లో అల్ శబాబ్ తీవ్రవాద సంస్థకు చెందిన 30 మంది మరణించారు.
అయితే, ఇదే సంస్థకు చెందిన 100 మందికి పైగా తీవ్రవాదులు మిలిటరీ దళాలపై దాడులు చేయడంతో ఆత్మరక్షణ చర్యగా ప్రతిదాడులు చేసినట్లు యూఎస్ ఆర్మీ తెలియజేసింది. సోమాలియాలో యూఎస్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌ను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులపై దాడులకు ప్రతికగా మిలిటెంట్ సంస్థ ప్రతి దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నాయని, అన్ని రకాలుగా మిలిటెంట్ దాడులను ఎదుర్కొంటామని యూఎస్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు. మే 2022 నుండి దాదాపు 500 ట్రూపులను సోమాలియాకు పంపింది. సోమాలియా విజ్ఞప్తి మేరకు యూఎస్ తమ ఆర్మీని సోమాలియాకు పంపారు.